ఇకమీదట వాట్స‌ప్ లో నంబరు ఎంటర్ చేస్తే వాళ్లు ఎక్కడున్నారో లోకేషన్ తో సహ చెబుతుంది.

ఇకమీదట వాట్స‌ప్ లో నంబరు ఎంటర్ చేస్తే వాళ్లు ఎక్కడున్నారో లోకేషన్ తో సహ చెబుతుంది.

kumar, 02/03/2017.



వాట్స‌ప్‌… ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది..! ఫేస్‌బుక్ దీన్ని కొనుగోలు చేసిన‌ప్ప‌టి నుంచి వాట్స‌ప్‌లో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అవ‌న్నీ వినియోగ‌దారుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. వాయిస్‌, వీడియో కాలింగ్ ఫీచ‌ర్స్ మొద‌లు కొని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌కు వాట్స‌ప్ అందుబాటులో ఉంటూ వ‌చ్చింది. మొన్నా మ‌ధ్యే వాట్స‌ప్ లో హోం స్క్రీన్ స్టేట‌స్ అనే కొత్త ఫీచ‌ర్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఇవే కాదు… అతి త్వ‌ర‌లో యూజ‌ర్ల‌కు మ‌రో బ్ర‌హ్మాండ‌మైన ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. అదే.. లైవ్ ట్రాకింగ్‌..! మ‌రి… దీని గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!


వాట్స‌ప్‌ను వాడుతున్న ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యూజర్లు త్వ‌ర‌లో ఓ నూత‌న ఫీచ‌ర్‌ను అందుకోనున్నారు. అదేమిటంటే… వాట్స‌ప్‌లో యూజ‌ర్లు ఇక‌పై త‌మకు క‌నెక్ట్ అయి ఉన్న వారి లొకేష‌న్ ను లైవ్‌గా ట్రాకింగ్ చేయ‌వ‌చ్చు. దీంతో అవ‌త‌లి వ్య‌క్తులు ఎక్క‌డ ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఇది మొద‌ట వాట్స‌ప్ గ్రూప్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానుండ‌గా, త‌ర్వాత సింగిల్ యూజ‌ర్ల‌కు కూడా విడుద‌ల చేయ‌నున్నారు. అయితే వాట్స‌ప్‌కు చెందిన బీటా వెర్ష‌న్‌ను వాడుతున్న ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఈ ఫీచ‌ర్‌ను ఇప్ప‌టికే పొంద‌వ‌చ్చు. అందుకు వారు వాట్స‌ప్ బీటా వెర్ష‌న్‌ను త‌మ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు… లైవ్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌ను ఎంచ‌క్కా ఉప‌యోగించుకోవ‌చ్చు..!


అయితే మ‌రి వాట్స‌ప్‌లో అవత‌లి వ్య‌క్తుల లొకేష‌న్ అంత సుల‌భంగా తెలిసిపోతే ఎలా..?  దాంతో ఇబ్బందులు ఉంటాయి క‌దా..? అని మీరు అనుకోవ‌చ్చు. కానీ… అందుకు సాధ్యం కాదు. ఎందుకంటే… ఏ యూజ‌ర్ వాట్స‌ప్‌ను వాడినా అత‌ని అకౌంట్‌లో లైవ్ ట్రాకింగ్ మొద‌ట డిఫాల్ట్‌గా డిజేబుల్ అయ్యే ఉంటుంది. దాన్ని కావాల‌నుకుంటేనే ఎనేబుల్ చేసుకోవ‌చ్చు. అందుకు టైమ్ లిమిట్ కూడా ఉంటుంది. ఎవ‌రైనా ఒక యూజ‌ర్ త‌న లొకేష‌న్ గురించి అవ‌త‌లి వ్య‌క్తుల‌కు తెలియాలి అనుకుంటేనే లైవ్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌ను ఎనేబుల్ చేసుకునే వీలు క‌ల్పించారు. లేదంటే డిఫాల్ట్‌గా ఆ ఫీచ‌ర్ డిజేబుల్ అయ్యే ఉంటుంది. ఈ క్ర‌మంలో లైవ్ ట్రాకింగ్ ఎనేబుల్ చేస్తే అందుకు యూజ‌ర్ ఎంచుకున్న టైం ప్ర‌కారం… ఆ స‌మ‌యం వ‌ర‌కు అత‌ని లొకేష‌న్‌ను ఇత‌రులు తెలుసుకోవ‌చ్చు. అదే టైం దాటిపోతే లైవ్ లొకేష‌న్ ట్రాకింగ్ మ‌ళ్లీ డిజేబుల్ అవుతుంది. మ‌ళ్లీ దాన్ని ఎనేబుల్ చేస్తేనే యూజ‌ర్ల‌ను అవ‌త‌లి వ్య‌క్తులు ట్రాక్ చేయ‌వ‌చ్చు. అతి త్వ‌ర‌లో ఈ ఫీచ‌ర్  యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానుండ‌గా, దీనిపై వాట్స‌ప్ ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌లేదు..!

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...