అమ్మాయిలను పడేసేందుకు 10 సీక్రెట్లు ఏంటో తెలుసా?
kumar, 17/02/2017.
ఈ రోజుల్లో అమ్మాయిలను పడేయటం కొందరు అబ్బాయిలకు చాలా తేలిక అయితే మరికొందరు ఏమో ఇష్టమయిన అమ్మాయిని పడేసేందుకు చాలా కష్టాలు పడుతున్నారు. ఆడవారు అవును అంటే కాదని కాదు అంటే అవునని చాలా మంది చెప్పుతుంటారు. అలా అని అన్ని విషయాలలో అలానే ఆలోచిస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రతి అమ్మాయి కూడా ఆమెలో ఉండే మంచి లక్షణాలను వారికీ ఇష్టమైన వారి నోట వినడానికి చాలా ఇష్టపడుతుంటారు. అలా చెపుతున్నప్పుడు వారిలో ఆనందం మాములుగా ఉండదంటా.
చాలా మంది అబ్బాయిలు ఏముంది చెప్పడానికి ఏంలేదు అంటూ మాట దాటివేస్తుంటారు. కానీ ప్రతి ఒక్క అమ్మాయిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. వాటిని గుర్తించి ఆ అమ్మాయితో షేర్ చేసుకుంటే చాలు మీ పైన రెట్టింపు ప్రేమ మొదలైపోతుందంటా. ఇలా చేయడం తో ఈజీ గా మీ ప్రేమలో పడిపోతారు. ఇదే కాకుండా ఇంకా 10 సీక్రెట్లు అమ్మాయిలను పడేయడానికి ఉన్నాయి అవి ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం.
1.నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు :
2.నా జీవితంలోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయివి నీవే :
ఈ మాటని మీరు మీ మనసులో నుండి ఆ అమ్మాయికి అర్ధం అయ్యేలా కనుక చెప్తే మీకు వేరే మాట అనేది చెప్పకుండా తన గుండెలో మీకు స్థానాన్ని ఇస్తుందంటా. ఎందుకంటే తన లైఫ్ లో నేను మాత్రమే ఉండాలి వేరే ఎవరు ఉండకూడదు అని అమ్మాయిలు భావిస్తారంటా. అందుకే తన గుండెలో ఎప్పడూ నిలిచి పోవాలి అనుకుంటే ఇలా తప్పకుండా చెప్పాలి.
3. నీవే నా ఏంజిల్ :
పడక గదిలో ఆడవాళ్లు తమని తాము బాగా గొప్పగా భావించుకుంటారట. ఆ సమయంలో భర్త కాస్త పొగిడిన చాలంటా బాగా సంతోషిస్తారంటా. కానీ పైకి మాత్రం ఏం తెలియనట్టు ప్రవర్తిస్తుంటారంటా. కానీ చాలామంది భర్తలు ఆ సమయంలో సహకరించే భార్యలని అబినందించారంటా. ఇప్పటి నుండీ అలా చేయకండి అభినందించి ఇంకా దగ్గరవ్వండీ.
4.అభిప్రాయాన్ని తెలుసుకోండి :
మీరు ఏదయినా కొనేముందు మీ భార్యని గౌరవించి తన అభిప్రాయాన్ని కూడా తీసుకుంటే తనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థమై మీ పైన ప్రేమ అనేది రెట్టింపు అవుతుందంటా. ఇప్పటి నుండి మీరు కూడా మీ పాట్నర్ ని గౌరవించండి.
5. నీవే నా డియరెస్ట్ ఫ్రెండ్ వి :
ఆడవాళ్ళకి మీ పైన మరింత ప్రేమ పెరిగే క్షణాలు ఏంటో తెలుసా, నా కష్ట సుఖాలు అన్నీ నీతోనే చెప్పుకుంటా ఎందుకంటే నా జీవితంలో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ నీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటా. నాకన్ని నువ్వే అనే మాటలు మిమల్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చేసుకునేలా చేస్తాయి.
6.ఆ సమయంలో ధైర్యం ఇవ్వాలి :
చాలామంది మహిళలు పెళ్లయిన తర్వాత తాను వెంటనే తల్లి కావాలని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో కాస్త భయపడతారు. ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె ఎప్పుడూ భర్త భరోసాను కోరుకుంటుంది. ఆ సమయంలో భర్త ఆమెకు ధైర్యం చెబుతూ ఉండాలి.
7.నీవు నా జీవితంలోకి రావడం నా అదృష్టం :
ఎంతటి వారు అయినా సరే ఈ మాట కచ్చితంగా అమ్మాయికి చెప్పాలిసిందే. ఎందుకంటే అమ్మాయి రావడం మీ లైఫ్ కి నిజంగానే మీ అదృష్టంగా భావించాలి. అలా భావించి తాను మీ లైఫ్ వచ్చాక మీకు జరిగిన అదృష్టాలన్నీ షేర్ చేసుకొని ఆంటీకి కారణం నువ్వే ఎందుకంటే నువ్వే నా అదృష్టం అని చెప్పుతే చాలు మీ ఇద్దరి మధ్య బాండ్ మరింత దృడంగా తయారవుతుంది.
8.నీ మనసు ఆమెకు తెలుసు:
ప్రతి భార్య కూడా తన భర్త ఎలాంటి వాడు అతనికి ఏం అంటే బాగా ఇష్టం అన్ని తెలుసుకుంటుంది. అందుకే మీ మనసులోని విషయాలను ఆమె ముందుగానే చెప్పేస్తుంటుంది. అలా మిమల్ని బాగా అర్ధం చేసుకున్నందుకు మీరు ఆమెని తప్పకుండా మెచ్చుకోవాలి. మీకు నచ్చిన వంట చేసినప్పుడు,మీకు ఏదయినా గిఫ్ట్ ఇచ్చినప్పుడు తనని కచ్చితంగా అభినందించాలి. ఇలా చేయడం వలన ఇద్దరి మధ్య దూరం అనేది తగ్గిపోతుంది.
9.నీవు నాతో జీవించడానికి సిద్ధమేనా? :
ఏదో మాటలు వచ్చు కదా అని ఊరికే చెప్పడం కాదు ఆ మాట మీద కచ్చితంగా నిలబడుతా అనుకున్నప్పుడే ఇలాంటి మాటలు ఆమెతో చెప్పాలి. ఏ అమ్మాయి అయినా తనకి నచ్చిన అబ్బాయి వచ్చి నాతో జీవితాంతం బతకడానికి సిద్దమేనా అని అడిగితే కచ్చితంగా ఆనందంగా ఒప్పుకుంటది. అందుకే ఈ మాట అనే ముందు మీరు ఫిక్స్ అయి ఉండాలి.
10.ఐ లవ్ యూ :
ప్రతి వారికీ ఐ లవ్ యూ అని చెప్పడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మనం చెప్పే విధానంలోనే తెలిసిపోతుంది నిజంగా మనసుతో చెప్పుతున్నామో లేదో అనేది. అందుకే మీరు మీ పాట్నర్ ని ఇష్టపడుతూ రోజు ఐ లవ్ యూ అని చెప్పడం మీ పైనా ప్రేమని రెట్టింపు చేస్తుంది. చూసారు కదా అబ్బాయిలు ఇవ్వని సరిగా పాటించి అమ్మాయిని పడేసి జీవితాంతం సుకంగా ఉండండి. జీవితాన్ని ప్రేమమయం చేసుకోండి.
అమ్మాయిలు కొన్ని విషయాలని దూరం పెట్టి అస్సలు బతకలేరు. ఆవి ఏంటి అంటే పొగడడం మరియు అభినందించడం. ప్రతి అమ్మాయి కూడా తనని బాగా పొగడాలి ఆరాధించాలని కోరుకుంటుంది. విన్నారుగా అబ్బాయిలు ఇప్పటినుండి అయినా అమ్మాయిలను అభినందిస్తూ,పొగిడేస్తూ ఈజీ మీకు పడేలా చేసుకోండి.
No comments:
Post a Comment