శివుడి దృష్టిలో ఈ పాపాలు చేసేవారు శివరాత్రి పూజలు ఆచరించినా పాపవిముక్తి లేదు..!!

శివుడి దృష్టిలో ఈ పాపాలు చేసేవారు శివరాత్రి పూజలు ఆచరించినా పాపవిముక్తి లేదు..!!

kumar, 24/02/2017.


శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. అని అందరికీ తెలిసిందే. అంటే ఈ ప్రకృతిలో జరిగే పనులన్నీ దైవాజ్ఞ లేకుండా జరగవని అర్ధం. పరమశివుడిని భోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. అలాగే తన భక్తులు చేసే పాపాలను తను మింగి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. శివుడు అమాయకుడైనా.. ఆ దేవ దేవుడికి కోపం వస్తే తట్టుకోవడం ఎవరితరమూ కాదు. శివుడి కోపం ఎంత తీవ్రమైందంటే.. శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులు ఈ పాపాలు కనుక చేస్తే శివుడు తప్పకుండ శిక్షిస్తాడని శివపురాణంలో ఉంది. వారు శివరాత్రి పూజలు చేసినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం దక్కదట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

* శివుని ప్రకారం ప్రతి మనిషి మూడు విధాలుగా పాపాలు చేస్తాడు. అవే.. ఆలోచనతో, చేష్టలతో మరియు మాటలతో…
* ఆడ, మగాళ్లలో ఎవరైనా ఇతరులు భార్య/ భర్తను పొందాలనే దురాలోచన చేస్తే శివుడి దృష్టిలో క్షమించరాని పాపం.
* ఇతరుల సంపదని అక్రమంగా పొందాలనే కోరిక ఉండటం కూడా క్షమించరాని పాపం.
* ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించాలని, వారి కలలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపం.
* ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా, ఎవరినైనా తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివుని దృష్టిలో క్షమించరాని పాపం.
* గర్భిణి స్త్రీల పట్ల లేదా ఆ రోజులు గడుపుతున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా, వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం.
* దురుద్దేశంతో ఇతరుల కీర్తి, ప్రతిష్టలకు భంగం కలిగించేలా అబద్ధాలు చెప్పడం క్షమించరాని పాపం.
* అనవసరమైన పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడి సమాజంలో వారికి చెడ్డ పేరు తేడానికి ప్రయత్నించినా అది క్షమించరాని పాపం.
* హింసాకాండలో పాల్గొనడం, మహిళలు, చిన్న పిల్లలు లేదా బలహీనపై ప్రతాపం చూపించడం క్షమించరాని పాపం.
* ఒక అమ్మాయికి తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం.
* కోడలితో లేదా వదినతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం కూడా శివుని దృష్టిలో క్షమించరాని పాపం.
* గురువులు, తల్లితండ్రులు, వృద్దులు, సన్యాసులు, వికలాంగులను తిట్టినా లేదా వారిపై చేయ్యిచేసుకున్నా శివుని దృష్టిలో అది మహాపాపం

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...