మీరు వాడే నంబర్ ను జియో ప్రైమ్ లోకి మారిస్తే మార్చి 2018 వరకు ఫ్రీ.. మార్చుకోవడం ఎలా అంటే?!
kumar, 24/02/2017.
ఉచిత కాల్స్ డేటా ఆఫర్లతో భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వ్యూహాత్మకంగా మరో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. మార్చి 31 తో జియో ఉచిత సర్వీసుల కాలం ముగుస్తుందనుకుంటున్న తరుణంలో జియో ప్రయిమ్ మెంబర్ షిప్ ప్రోగ్రాం ను తెరపైకి తెచ్చింది. దీని వల్ల అనేక ప్రయోజనాలను కంపెనీ కల్పించనుంది. ఇందులో చేరినవారు జియో అపరమిత వాయిస్, డేటా సర్వీసులను మరో ఏడాదిపాటు (2018 మార్చి 31 వరకు) పొందొచ్చు. అయితే ఇప్పటికీ చాలా మంది జియో సిమ్ ని తీసుకోని వారుంటారు. ఎప్పటి నుంచో వాడుతున్న నంబర్ ని ఎందుకు తీయడం అని చాలా మంది జియోవైపు చూడడం లేదు. అయితే అలాంటి వారు ఉన్న నంబర్ తోనే జియో ప్రయిమ్ లోకి మారొచ్చు. అదెలాగో మీరే చూడండి.
* మీ మొబైల్ నంబర్ నుండి PORT పక్కన మీ మొబైల్ నంబర్ టైప్ చేసి 1900కి మెసేజ్ చేయండి. ఆ తర్వాత మీ వెరిఫికేషన్ పూర్తి కాగానే మీకు రిఫరెన్స్ కోడ్ ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది.
* రిఫరెన్స్ కోడ్ వచ్చిన వెంటనే ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు జియో యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకుని ఆఫర్ కోడ్ ని జనరేట్ చేసుకోవాలి.
* ఇప్పుడు దగ్గరిలోని జియో షోరూమ్ కి వెళ్లి మీకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇస్తే వాళ్లు మీకు మీ పాత నంబర్ పైనే జియో సిమ్ ని ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు వచ్చిన రిఫరెన్స్ కోడ్ చెప్పాల్సి ఉంటుంది.
* మీ పాత నంబర్ పై ఏమైనా పేమెంట్లు ఆగిపోయి ఉంటే అవి క్లియర్ చేసుకుని జియో ప్రయిమ్ లోకి మారండి. లేకుంటే మీకు కన్ఫర్మేషన్ ఎస్సెమ్మెస్ రాదు.
* ఇక అంతా పూర్తయిన తర్వాత మీ నంబర్ ని జియోలోకి మార్చుకున్నట్లుగా మెస్సేజ్ వస్తుంది. ఇక అంతే మీరు జియో ప్రయిమ్ ఆఫర్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.

No comments:
Post a Comment