డబ్బులున్నా లేదు.. లేదు.. అంటున్నారా? ఐతే లేకుండానే పోతుందట.. ఎందుకో తెలుసా?!

డబ్బులున్నా లేదు.. లేదు.. అంటున్నారా? ఐతే లేకుండానే పోతుందట.. ఎందుకో తెలుసా?!

kumar, 02/03/2017.


సాధారణంగా ప్రతీమనిషి ఏదో ఒకటి మాట్లాడే మాటల్లో, ఆలోచించే ఆలోచనలో మంచి చెడు రెండూ ఉంటాయి. కాని మన ఆలోచనలు, మాటలు అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే పైన తథాస్తు దేవతలు అనేవారు ఉంటారని, మనం అనే మాటలకు తథాస్తు అనేస్తుంటారని చెబుతుంటారు. అంటే దాని అర్థం మనం మంచిని కాంక్షిస్తే మంచే జరుగుతుంది, అదే చెడుని తలచుకుంటే అదే జరుగుతుందని వారు అనే మాటల్లోని అంతరార్థం. అందుకే మంచినే తల్చుకుంటే తథాస్తు దేవతల ఆశీర్వాదం వల్ల అంతా శుభం జరుగుతుంది. ఇంకా తథాస్తు దేవతలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలేమంటే..



సాయం సంధ్యవేళల్లో అయితే తథాస్తు దేవతలు సంచరిస్తుంటారని ప్రతీతి. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా ఏ మాట మాట్లాడకూడడు, అలా అనుకుంటే దేవతలు తథాస్తు అని అంటారు. అందుకే నెగటివ్‌గా మనలో మనం ఆలోచించే యోచనలు సైతం ఒక్కోసారి జరిగిపోతూ వుంటాయి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తంచేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. కొందరు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఎప్పుడూ డబ్బులేదని అంటూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఆరోగ్యం భాగోలేదని ఊరికినే అంటారు. అలాంటి మాటలు వలన తథాస్తు దేవతలు తథాస్తు అంటే నిజంగానే అలా జరిగిపోతుంది. అందుకే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని సున్నితంగా చెప్పేయండి. అంతేకాని ఇలా మీగురించి మీరు చెడుగా చెప్పుకోవద్దు. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకుట మంచిది కాదని, ఎప్పుడూ మంచి మాత్రమే మాట్లాడాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...