సొంత ఇల్లు లేని వారికి కేంద్రం గుడ్ న్యూస్!!
kumar, 25/02/2017.
నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి బడ్జెట్ కావడంతో మధ్యతరగతి ప్రజల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరాల మూటను సిద్ధం చేస్తుంటే జనం మాత్రం పెద్ద ఎత్తున ఆర్థిక శాఖకు రికమండేషన్స్ పంపిస్తున్నారు. లక్షల రిక్వస్ట్ లు వస్తున్నా.. అన్నింటిలో టాప్ 5లో ఉన్న డిమాండ్ మాత్రం గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు.. దీంతో మధ్య తరగతి ఈ ప్రకటనపై కోటి ఆశలతో ఉన్నారన్న విషయం మోఢీ ప్రభుత్వానికి స్పష్టమైంది. ప్రస్తుతం రూ.12లక్షల గృహ రుణంపై మూడుశాతం, రూ.9లక్షల వరకు ఉండే లోన్లపై 4శాతం వడ్డీ రాయితీ లభిస్తోంది. టైర్ 3 పట్టణాలే లక్ష్యంగా దీనిని అమలులోకి తెచ్చారు. దీన్ని పెద్ద నగరాలకు కూడా వర్తింప జేస్తే అక్కడ ఉండే మధ్య తరగతి వర్గానికి కొంతైనా ఉపశమనం లభిస్తుంది.
ఇళ్ల కొనుగోలుపై వడ్డీ తగ్గింపు ప్రకటన ఉంటుందనే ఆశ పెట్టుకున్నారు నగరాలు, పట్టణాలకు చెందిన ప్రజలు. నోట్ల రద్దు తర్వాత రేట్లు దిగి వస్తాయని భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్ ప్రిపరేషన్ లో ఉన్న కేంద్రానికి ఈ విషయంపై లక్షల సంఖ్యలో వినతులు వచ్చాయంట. దేశవ్యాప్తంగా వచ్చిన డిమాండ్లలో టాప్ 5లో ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని ఉందంట. దీంతో కేంద్రం ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రియాల్టీ రంగం ఊపందుకోవటానికి కూడా వడ్డీ రేట్ల తగ్గింపు బూస్టింగ్ ఇస్తుందంటున్నారు

No comments:
Post a Comment