ఆ 7గురు అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట.. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిల గురించి చాణక్యుడు చెప్పిన రహస్యాలు!

ఆ 7గురు అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట.. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిల గురించి చాణక్యుడు చెప్పిన రహస్యాలు!

kumar, 25/02/2017.



ప్రతి వ్యక్తి జీవితంలోనూ వివాహం కీలక ఘట్టం. చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలనే ఊహలు, అభిప్రాయాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. జీవితంపై అవగాహన కలిగిన, మంచి, చెడులను అర్థం చేసుకోగలిగిన అమ్మాయి భాగస్వామిగా దొరికితే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు. అయితే జీవితం సాఫీగా సాగాలంటే ఎలాంటి అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోకూడదో చాణక్యుడు ఇలా చెప్పాడు..

1.అందానికి ప్రాధాన్యమిచ్చే అమ్మాయిలు:

అందాన్ని చూసుకుని విర్రవీగే అమ్మాయిలను నిర్మొహమాటంగా తిరస్కరించాలని చాణక్యుడు చెబుతున్నాడు. వారు తమ అందానికి ఇచ్చే ప్రాధాన్యం చుట్టూ ఉండే కష్ట సుఖాలకు ఇవ్వరట. శారీరక అందం కన్నా మానసిక అందం కలిగిన అమ్మాయిలను మాత్రమే వివాహ మాడాలని చెప్పాడు.

2.కుటుంబ నేపథ్యం సరిగ్గాలేని అమ్మాయిలు:

అమ్మాయిల కుటుంబ నేపథ్యం సరిగ్గా లేకున్నా పెళ్లి తర్వాత కష్టాలు తప్పవట. పెళ్లయిన కొద్ది రోజులకే వేరు కాపురం గురించి పోరు పెట్టవచ్చట. అత్త మామల పట్ల అమర్యాదగా ప్రవర్తించవచ్చు.

3.అబద్ధాలు చెప్పే అమ్మాయిలు:

అమ్మాయిల ప్రవర్తన తీరు తీక్షణంగా గమనిస్తే ఆమె మీతో ఎంత నిజాయితీగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. తరచూ అబద్ధాలు చెప్పే అమ్మాయిలను పెళ్లాడవద్దని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే పెళ్లయిన తర్వాత కూడా రకరకాల అబద్ధాలు చెప్పి మీ కుటుంబంలో కలతలు తీసుకరావొచ్చు.

4.విశ్వాసం లేని అమ్మాయిలు:

కుటుంబానికి విశ్వాసం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దని సూచిస్తున్నాడు చాణక్యుడు. తన కుటుంబానికే విశ్వాసం లేని అమ్మాయిలు భర్త పట్ల కూడా విశ్వాసఘాతుకంగానే ప్రవర్తిస్తారట.

5.ఇంటి పనులు తెలియని అమ్మాయిలు:

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవడంలో మగాళ్లతో పోల్చితే ఆడవాళ్లదే ప్రధాన పాత్ర. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు.

6.గొడవలు పడే అమ్మాయిలు:

చీటికీ మాటికీ వివాదాలు పెట్టుకునే అమ్మాయిలతో పెళ్లే వద్దంటున్నాడు చాణక్యుడు. ఇటువంటి వారు ఏవిధంగానైనా తమకు కావల్సింది సాధించుకుంటారట. అటువంటి వారిని వివాహమాడితే జీవితాంతం తిప్పలు తప్పవట.

7.దైవ భక్తిలేని అమ్మాయిలు:

అమ్మాయిలకు దైవ భక్తి తప్పనిసరి అని చాణక్యుడు చెబుతున్నాడు. నిత్యం పూజించే అమ్మాయిలే భర్తను బాగా చూసుకుంటారట

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...