విద్యార్థులకు బ్యాడ్ న్యూస్!
kumar, 25/02/2017.
విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది విద్యాశాఖ. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలండర్ లో సంప్రదాయ విధానానికి స్వస్తి చెబుతోంది. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న అనేక పద్ధతుల స్థానంలో కొత్త విధానాలు ప్రవేశపెడుతోంది. సెంట్రల్ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్ తరహాలో రాష్ట్ర విద్యా విధానాన్ని కూడా తయారు చేస్తోంది. దీని ప్రకారం ఇక విద్యార్థులకు ఒక్కపూట (ఒంటిపూట) బడులు అనేవి ఇక ఉండవు. జూన్‌లో ప్రారంభించాల్సిన పైతరగతుల బోధనను ఈసారి సీబీఎస్‌ఈ స్కూళ్ల తరహాలో మార్చి 21 నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. అంటే వచ్చే ఏడాది సిలబస్ ను సెలవులకు ముందే మొదలు పెడతారన్నమాట. ఇంకా అందులో ఉండే మార్పలు ఏమంటే..
వేసవి ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రతి ఏటా నిర్వహించే ఒంటి పూట బడుల విధానం లేకుండా చూడాలని భావిస్తోంది. ఆయా తేదీల్లోనూ రెండు పూటల బడులు నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి ప్రారంభించి.. ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచనకు వచ్చింది. ఇక వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇచ్చేలా కేలండర్‌లో పొందుపరుస్తోంది

No comments:
Post a Comment