జియో బంపర్ ఆఫర్.. సెప్టెంబర్ వరకు ఫ్రీ.. కాకపోతే ఓ షరతు!!

జియో బంపర్ ఆఫర్.. సెప్టెంబర్ వరకు ఫ్రీ.. కాకపోతే ఓ షరతు!!

kumar, 19/02/2017.


ఇప్పటికే టెలికాం రంగంలో ఉచిత కాలింగ్, డాటా ఆఫర్లతో దడ పుట్టిస్తున్న రిలయన్స్ జియో ఇంకెన్ని సంచలనాలు చేస్తుందోనని యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తోంది. ఓవైపు ఉచిత డేటా, కాలింగ్ ఆఫర్లను ఆనందిస్తూ జియో కస్టమర్లు ఎంజాయ్ చేస్తుండగా.. మరోవైపు ఇతర టెలికాం సంస్థలూ జియోలోకి మారిపోకుండా తమ కస్టమర్లకు రోజుకొక ఆఫర్ ఇచ్చుకుంటూ నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పోటీ సంస్థలకు మరింత దడ పుట్టించే విధంగా జియో తన ఫ్రీ ఆఫర్ ను సెప్టెంబర్ వరకు పొడిగిస్తారని జాతీయ మీడియా అయిన ఎన్గీటీవీ, జీ న్యూస్ వంటి వాటిల్లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. వెల్ కం ఆఫర్ పేరిట డిసెంబర్ వరకు ఫ్రీ ఇచ్చి తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మరో 3నెలలు పొడిగించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. 90రోజులకు మించి ఫ్రీ ఇవ్వరాదనే ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఇప్పుడే అధికారికంగా చెప్పలేకపోతున్నారని తమ కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే 7కోట్ల మంది జియో వినియోగదారులు అతి తక్కువ కాలంలోనే జియో నెట్ వర్క్ లోకి చేరిపోవడం సంచలనంగా చెబుతున్నాయి టెలికాం వర్గాలు.



దేశం మొత్తం సంచలనంగా మారిన జియో ప్లాట్ ఫాం నుంచి బోలెడు సర్వీసులు లాంచ్ చేసేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. కొద్ది రోజుల్లోనే ప్రయోగాత్మకంగా 5జీ సర్వీసులు అందించేందుకు ట్రయల్ నడుస్తోంది. 5జీ సర్వీస్ తో పాటుగా 5జీ స్మార్ట్ ఫోన్ తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ ని తెచ్చేందుకు ముమ్మర యత్నాలు చేస్తోంది. ఇవన్నీ కలిపి ఒకే ఫోన్ లో వస్తాయని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ఫోన్ ల ఫొటోలు కూడా నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సర్వీసులు కొనుగోలు చేసిన వారికి జియో ఫ్రీని సెప్టెంబర్ వరకు పొడిగింపు ఇస్తారని చెబుతున్నారు. ఇంకా మార్కెట్ ను కొల్లగొట్టాలని జియో యాజమాన్యం బావిస్తే ఎటువంటి షరతుల్లేకుండా మరో 3నెలలు అందరికీ ఫ్రీ ఇస్తారని కూడా అంటున్నారు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...