ప్రజలకు మోఢీ బంపర్ ఆఫర్.. అకౌంట్లలోకి డబ్బులు..!
kumar, 19/02/2017.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన ఆర్థిక లావాదేవీల చెలామణి సంక్షోభంతో దేశ ప్రజలంతా అసంతృప్తివైపుగా మళ్లుతున్నారని ప్రభుత్వానికి నివేధికలు అందుతున్నాయి. అందుకే నరేంద్ర మోఢీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంటుందని కొన్ని జాతీయ మీడియాలు కథనాలు ఇస్తున్నాయి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకం కింద జమ అయిన సొమ్ము నుంచి రాబోయే బడ్జెట్ లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆ కథనాల్లో పేర్కొంటున్నారు. అసలే 5 రాష్ట్రాల ఎన్నికలు సైతం అతి సమీపంలో ఉండడంతో ప్రభుత్వం పేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఎంతోకొంత జమ చేస్తారని చెబుతున్నాయి. ఇలా ఎంతలేదన్న ఒక్కో ఖాతాలో రూ.1000కి తగ్గకుండా వేస్తారని కూడా అంటున్నారు.
పీఎంజీకేవై పథకాన్ని డిసెంబరు 17న ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా ఆదాయాన్ని వెల్లడించిన పన్ను ఎగవేతదారులకు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఇచ్చింది. మార్చి 31 వరకు ఈ ఖాతాలో అక్రమ సంపాదనా తాలూకు డబ్బు జమ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బునే ప్రజల ఖాతాల్లో వేస్తారని సమాచారం. అంతేకాకుండా 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికీ ప్రతి నెలా డబ్బు చేరేలా మరో సరికొత్త సంచలన పథకానికీ మోఢీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అదేమంటే..
బేసిక్ ఇన్‌కమ్ ఎర్త్ నెట్‌వర్క్(బీఐఈఎన్) ప్రణాళికను మోఢీ ప్రభుత్వం అమలుచేసే వీలున్నదట. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలంటే రకరకాల షరతులు ఉండటంవల్ల అవినీతి పెరుగుతోందని, ఆ సొమ్ము లబ్ధిదారులకు చేరట్లేదని బీఐఈఎన్ వాదన. ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందాలంటే ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ ఇలా కొన్ని పత్రాలు సమర్పించాలి.
అనర్హులు సైతం నకిలీ పత్రాలతో వీటిని వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే అలాంటి షరతులేవీ లేకుండా అందరికీ ఇచ్చేస్తే అవినీతికి తావు ఉండదని బీఐఈఎన్ ప్రభుత్వానికి సూచిస్తోంది. ప్రభుత్వం మరో స్టెప్ ముందుకు వేసి.. అమల్లో ఉన్న సంక్షేమ, రాయితీ పథకాలన్నిటినీ తొలగించి నేరుగా అందరికీ డబ్బే ఇచ్చేయాలని సలహా ఇస్తోంది. ఒకవేళ మన ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలనుకుంటే.. ఉపాధి హామీ పథకం, ఇందిర ఆవాస్ యోజన, పీడీఎస్ వంటి 1000 పథకాలను తీసేయాల్సి ఉంటుంది. అది సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ భారత ప్రభుత్వం ఈ పథకం అమలుకు సిద్ధమైతే ఎంత ఖర్చవుతుంది? కుటుంబానికి ఎంత వరకూ వచ్చే అవకాశం ఉంది? ఇండియన్ బేసిక్ ఇన్‌కమ్ నెట్‌వర్క్(ఐబీఐఎన్) ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.7 లక్షల కోట్ల మేర రాయితీలు, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతోంది. వాటన్నిటినీ తీసేసి యూబీఐ కింద పంచితే దేశంలోని ప్రతి కుటుంబానికీ రూ.2500 దాకా ఇవ్వొచ్చని ఐబీఐఎన్ వాదన. సంపన్నులను తీసేస్తే సామాన్య వాటా మరింతగా పెరుగుతుందట. చూద్దాం 2019 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మోఢీ ప్రభుత్వం.. పెద్ద నోట్ల రద్దు వంటి ఎన్ని సంచలన నిర్ణయాలు

No comments:
Post a Comment