మోడీ వరాల జల్లు ఇక నుంచి నిరుద్యోగులకు నెల నెలా వేతనం!!
kumar, 19/02/2017.
ఈసారి కేంద్ర బడ్జెట్లో ప్రధాని నరేంద్ర మోదీ వరాల వాన కురిపించబోతున్నారా? పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ నిరుపేదలు, మధ్య తరగతి, రైతులు, పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారా? ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను రేట్లలో భారీ మార్పులు ఉండనున్నాయా? రైతులకిచ్చే సబ్సిడీ రుణాలకు సంబంధించి కొత్త పథకం ప్రకటించనున్నారా? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెడుతుండడంతో బడ్జెట్‌పై ప్రతి ఒక్కరికీ భారీ అంచనాలు ఉన్నాయని చెబుతున్నాయి. రియల్టీ రంగానికి ఉద్దీపనలో భాగంగా గృహ రుణాల్లో వడ్డీ రేట్లపై ఆదాయ పన్నులో భారీ మినహాయింపు ఇవ్వనుందని ఐడీఎ్‌ఫసీ చీఫ్ ఎకానమిస్ట్ ఇంద్రనీల్ పాల్ చెప్పారు. ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంపై వసూలు చేస్తున్న 15 శాతం సర్వీస్ టాక్స్‌ను రద్దు చేసే అవకాశం ఉందని, ప్రీమియం మినహాయింపు పరిమితిని రూ.25 వేల నుంచి 50 వేలకు పెంచొచ్చని బీమా రంగ నిపుణుల అంచనా.
రైతులపై వరాలు
పెద్ద నోట్ల రద్దుతో ఎక్కువగా ఇబ్బంది పడింది రైతులేనని, తాజాగా ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ల్లోనూ రైతులే కీలకమని, ఈ నేపథ్యంలో రైతులకు అనుకూలంగా బడ్జెట్‌లో పలు నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. పావలా వడ్డీ రుణాలు కొనసాగించవచ్చని, సబ్సిడీ నిధులను ఈసారి మరింత పెంచొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. పూలు, కూరగాయల సాగు చేసే రైతులకు ప్రత్యేక వరాలు ఉండొచ్చని సమాచారం.
నిరుద్యోగులకు భృతి 5000
నిరుద్యోగులకు ఏటా రూ.5000 భృతిపై బడ్జెట్లో సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (యూబీఐ) పథకం అమలుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దాని తరహాలో నిరుద్యోగ భృతిని అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. యూబీఐ పథకాన్ని మన దేశంలో అమలు చేసే పరిస్థితి లేదని, అందుకు భారీ ఎత్తున నిధులు అవసరమని, సబ్సిడీల్లో కోత కోస్తే మాత్రం దీనికి నిధులు వెచ్చించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిరుపేద నిరుద్యోగులకు నెలవారీ సామాజిక భద్రత పథకంపై నీతిఆయోగ్ ఇప్పటికే కసరత్తు చేస్తోంది.

No comments:
Post a Comment