‘జియో’ ఫ్రీ ఆఫర్ మళ్లీ పొడిగింపు!!
kumar, 19/02/2017.
ఇప్పటికే ఆరునెలలపాటు ఉచిత కాల్స్ , డేటా సేవలు అందిస్తున్న రిలయన్స్ జియో, టెలికాం కంపెనీలకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఇది చాలదన్నట్లు ఈ ఆఫర్ ను మరో మూడు నెలలు అంటే జూన్ 30 వరకు పొడిగించనున్నట్లు నిర్ణయం తీసుకుందని ఇన్ సైడ్ సమాచారం. ఐతే, ఈసారి ఉచిత సేవలకు కొంత రుసుము విధించాలనే యోచనలో వున్నట్లు ఆ కంపెనీ వర్గాల కధనం. కేవలం రూ.100 కే అందించాలన్నది జియో థాట్. ఈ ఆఫర్ ముగిసేలోపు కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తోందట.రిలయన్స్ జియో వెల్ కమ్ ఆఫర్ పేరిట ఉచిత సేవలను అందించింది. ఆ తర్వాత ‘హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ ’ పేరిట ఈ ఏడాది మార్చి 31 వరకు దాన్ని పొడిగించింది.
జియో దెబ్బకు మిగతా టెలికాం సంస్థలు డేటా ఛార్జీలను తగ్గించాయి. ఈ క్రమంలో జియో ఉచితంగా సేవలు అందించడంపై టెలికాం కంపెనీలు ట్రాయ్ కి ఫిర్యాదు చేశాయి కూడా! దీంతో కొత్తగా ఆలోచించిన జియో, కొంత రుసుముతో సేవలను అందిస్తే ప్రత్యర్థుల నుంచి ఎలాంటి సమస్య వుండదని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిద్వారా ఖాతాదారులను పెంచుకోవడమేకాదు, ఆ సెక్టార్ లో తమకు ఎదురులేకుండా వుండాలన్నదే ఆలోచనగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు రిలయన్స్ పై గుర్రుగా వున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తాయో చూడాలి.

No comments:
Post a Comment