ఫ్రీగా వైఫై దొరికింది కదా అని.. ఇలాగాని చేశారో.. సైబర్ నిపుణుల హెచ్చరిక!!

ఫ్రీగా వైఫై దొరికింది కదా అని.. ఇలాగాని చేశారో.. సైబర్ నిపుణుల హెచ్చరిక!!

kumar, 19/02/2017.



ఇప్పుడు వైఫై లేని ప్ర‌దేశం లేదు. కొన్ని వ్యాపార సంస్థ‌లు, రెస్టారెంట్లు కస్టమర్లను ఆక‌ర్షించేందుకు ఉచిత వైఫై ఇచ్చేస్తున్నాయి. అయితే ఉచితంగా దొరికింది క‌దా అని ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని సైబ‌ర్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేయడం, అదీ ఫ్రీ వైఫై వాడిన వారి ఖాతాల నుంచి ఎక్కువ జరగడం సైబర్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో దీనిపై హైదరాబాద్ సైబర్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు- సైబ‌ర్ భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సులు సైతం నిర్వ‌హించారు. సైబ‌ర్ నేరగాళ్లు చేసే మోసాల‌ను స‌ద‌స్సులో నిపుణులు వివ‌రించారు. ఖాతాల్లోని న‌గ‌దు అక‌స్మాత్తుగా మాయ‌మైతే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అక్కడ చెప్పిన విషయాలివే..

కొంద‌రికి మూడు, నాలుగు బ్యాంక్ ఎకౌంట్లు ఉంటాయి. అన్ని ఖాతాల‌కు ఆన్‌లైన్ బ్యాంకింగ్ స‌హా క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగిస్తుంటారు. సరిగ్గా ఇదే సైబ‌ర్ మోస‌గాళ్ల‌కు అనువుగా మారుతుంది. సాధార‌ణంగా చాలామంది ఖాతాదారులు త‌మ పాస్‌వ‌ర్డ్‌ల‌ను సుల‌భంగా గుర్తుపెట్టుకునేలా క్రియేట్ చేసుకుంటారు. అంటే నిక్‌నేమ్‌, ఇంటిపేరు, మొబైల్ నంబ‌రులోని మొద‌టి, చివ‌రి నంబ‌రు, పుట్టిన తేదీలు, బైక్ నంబ‌రు.. ఇలా సుల‌భంగా ఉన్న‌వి పెట్టుకుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల హ్యాక‌ర్ల‌కు ఈజీగా దొరికిపోతారు. కాబ‌ట్టి పాస్‌వ‌ర్డ్ ఎప్పుడు నంబ‌ర్లు, లెట‌ర్ల‌తో క‌ల‌గాపుల‌గంగా ఉండాలి. ఏటీఎం పిన్ నంబ‌రును ఎవ‌రికీ చెప్ప‌కూడ‌దు. బ్యాంకు ఖాతాల విష‌యంలో గోప్య‌త అవ‌స‌రం. ఇంట‌ర్‌నెట్ కేఫ్‌, ఇత‌రుల కంప్యూట‌ర్ల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేయ‌డం ప్ర‌మాద‌క‌రం. మ‌రీ ముఖ్యంగా ఉచిత వైఫ్‌తో చేయ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రం.

ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిపే కంప్యూట‌ర్‌లో త‌ప్ప‌కుండా అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉండాల‌న్ని విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాంటీ వైర‌స్‌, యాంటీమాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లు కూడా ఉండాల్సిందే. మార్కెట్లో అందుబాటులో ఉన్న ప‌లు ర‌కాల ఓఎస్‌లు, యాంటీవైర‌స్, మాల్‌వేర్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం ద్వారా సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చెక్‌పెట్టొచ్చు.సైబ‌ర్ నేరాల‌కు సంబంధించిన సందేహాల‌ను www.infosecawarness.in వెబ్‌సైట్ ద్వారా కానీ,isea@cdac.in అనే ఈ మెయిల్ ద్వారా కానీ నివృత్తి చేసుకోవ‌చ్చు. ఫిర్యాదు చేయొచ్చు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...