ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమా, అబద్ధమా తెలుసుకునే అద్భుత ట్రిక్!
kumar, 20/02/2017.
అబద్ధానికి, నిజానికి మధ్య ఓ సన్నని గీత మాత్రమే ఉంటుంది. ఇరువురి మధ్య స్నేహానుబంధాన్ని పెంచే అద్భుత శక్తి ఆ సన్నని గీతకు ఉంది.. అలాగే వారి మధ్య విరోధాన్ని కలిగించి శత్రుత్వాన్ని పెంచే గుణం కూడా ఆ సన్న గీతకే ఉంటుంది. కొందరు ఎంత ప్రయత్నించినా అబద్ధం చెప్పలేరు. ఒకవేళ చెప్పినా వెంటనే దొరికిపోతారు. ఇంకొందరేమో బలే అతికినట్టు అబద్ధాన్ని ఇట్టే చెప్పేస్తారు. ఇలాంటి వారితోనే మీ జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు దూరంగా పెట్టాలి. మరి వారిని ఇగ్నోర్ చేయాలంటే అసలు వారు చెప్పేది నిజమో, అబద్ధమో మనకు తెలిసి ఉండాలి కదా.. అందుకే ఓ చిన్న ట్రిక్ ఫాలో అయితే సరి. ఇంతకూ అదేమిటంటే..
ఇది సాధారణ ట్రిక్ ఏమీకాదు. ఎంతోమందిపై ప్రయోగించి నిరూపించిన ట్రిక్. ఈ ట్రిక్ తో ఎదుటి వ్యక్తి మీతో చెప్పేది అబద్ధమా? నిజమా? అనేది పసిగట్టొచ్చు. ఎవరైనా మీతో మాట్లాడేప్పుడు.. అతను చెప్పే విషయం మీకు సరిగ్గా అర్థం కావడానికి తన చేతులు ఎక్కువగా కదుపుతున్నాడంటే అతను చెప్పేది నిజం అని అర్థం. మనసులో నుంచి ఎటువంటి ఫిల్టర్లు లేకుండా మాట వచ్చినప్పుడు ఇలా ఆటోమేటిగ్గా చేతులు కదులుతాయట. అదీ దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్. ఇక తను మీకు వివరించేప్పుడు అతని చేతులు ఎక్కువగా కదపకుండా స్టడీగా ఉన్నాయంటే తను చెప్పేది అబద్ధమని నిర్థారణకు వచ్చేయొచ్చట. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు ఎదుటి వ్యక్తి చెప్పేదాంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలిసిపోతుంది. కావాలంటే ఇక నుంచి మీరూ ట్రై చేసి చూడండి.. ఎదుటి వాళ్లు ఇట్టే దొరికిపోతారు.

No comments:
Post a Comment