మనదేశంలో మొదటి సారిగా చలామనిలో కరెన్సీ ఎప్పుడు తెలుసా.
kumar, 20/02/2017.
చేసింది మహ్మద్ బీన్ తుగ్లక్, 1325 – 1351 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన తుగ్లక్ కు దూరదృష్టి ఎక్కువ, అందుకే రాబోయే తరాల గూర్చి ఆలోచన చేసేవాడు. ఆచరణలో అవి అంతగా సక్సెస్ కాకపోయినా….తర్వాతి తరాలకు మాత్రం ఆదర్శంగా నిలిచాయి. అందులో ప్రధానమైనది చలామనిలో ఉన్న కరెన్సీ రద్దు.
తుగ్లక్ కరెన్సీ ని ఎందుకు రద్దు చేయాలనుకున్నాడు:
తుగ్లక్ పరిపాలనా కాలంలో…. బంగారం మరియు వెండి నాణేలు చలామనిలో ఉండేవి. బంగారం, వెండి విలువను గ్రహించిన తుగ్లక్….వాటిని కరెన్సీగా రద్దు చేసి వాటి స్థానంలో చైనీయుల నమూనాల సహాయంతో ముద్రించిన ఇత్తడి, రాగి నాణేలను విడుదల చేశాడు. ప్రజల దగ్గరున్న పాత బంగారం, వెండి నాణాలను ప్రభుత్వ ఖజనాకు అప్పగించి వాటి స్థానంలో రాజ్యం కొత్తగా విడుదల చేసిన ఇత్తడి, రాగి నాణాలను తీసుకోవాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేశాడు. పాత వాటికి ఇక మీదట విలువ ఉండదని ప్రకటించాడు.
కొంత మంది ప్రజలు మాత్రం…తమ వద్ద ఉన్న బంగారం, వెండి నాణాలను ప్రభుత్వ ఖజానాకి ఇచ్చి వాటి స్థానంలో కొత్త కరెన్సీని తెచ్చుకున్నారు. కానీ తెలివిమీరిన చాలా మంది ప్రజలు మాత్రం…తమ దగ్గరున్న పాత బంగారం, వెండి నాణాలను అలాగే ఉంచి, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాణాలను దొంగచాటుగా ముద్రించుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నాణేలపై లిపీ,కళాకృతులూ నాణ్యవంతముగా లేనందున దొంగచాటుగా నాణేలు తయారుచేసేవారికి తమపని సులభతరమైనది. ఈ ఉపాయం విఫలమైనది, ఖజానాలో రాగి మరియు ఇత్తడి నాణేలు సంవత్సరాల తరబడీ గుట్టలుగా పేరుకుపోయాయి.
ఉపాయం సక్సెస్ కాకపోయిన…ఈ ఐడియాను తర్వాత కఠినంగా అమలు చేశారు. ముద్రణాపరంగా అత్యంత నాణ్యతను పాటించి, దొంగ కరెన్సీ తయారు చేయడానికి ఆస్కారం లేకుండా చేసి… పటిష్టమైన కరెన్సీమారకాన్ని ప్రవేశపెట్టారు.
తుగ్లక్ తన నాణేలను, ఢిల్లీ, లక్నో, దారుల్ ఇస్లాం, సుల్తాన్ పూర్, తుగ్లక్ పూర్, దౌలతాబాదు, మరియు ముల్క్-ఎ-తిలంగ్ (తెలంగాణా) లలో ముద్రించేవాడు

No comments:
Post a Comment