ఉదయం లేవగానే ఎవరి ముఖం చూస్తే.. మంచి జరుగుతుందో తెలుసా..!

ఉదయం లేవగానే ఎవరి ముఖం చూస్తే.. మంచి జరుగుతుందో తెలుసా..!

kumar, 20/02/2017.



మనం సాదారణంగా ఏదైనా పని చేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమి కలిసిరానప్పుడు ”పొద్దున్నే లేచి ఎవరిముఖం చూశానో కాని” అని ఎత్తుకుంటారు.  ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా దేవుడి చిత్రపటం చుడండి. ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులు చూసుకోండి. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరచేతి ముని వెళ్ళు లక్ష్మి దేవి స్థానం. అరచేయి సరస్వతి స్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా? లక్ష్మీదేవి చంచలం అనే విషయం అందరికి తెలుసు కదా! ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలియదు.

అందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునివేళ్ళ మీద కుర్చుని వుంటుంది. మనం ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటనవేలు చూపుడువేలు టిక్కు టిక్కు మని కొడుతూ అడుగుతాం కదా. అలాగే సరస్వతి దేవి అరచేతిలో ఉంటుంది. మనం పుస్తకం పట్టుకుని చదవాలనుకుంటే అరచేతిలోనే పట్టుకుంటాం. ఏమి చేస్తున్నావు అని ఎవరైనా అడిగితె అరచేతులు రెండు దగ్గర పెట్టు ముడిచి చదువుతున్నాను అని చూపిస్తాం. అలానే మనం ఎవరిననైన కొట్టాలి అనుకున్నా, లేక కోపం వచ్చిన పిడికిలి బిగిస్తాం. ఆ పిడికిలి బలం (శక్తి) అంతా మణికట్టు మీదే ఆధారం. కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్టు ఉంటుంది. ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఈ శ్లోకం పఠించాలి..
కరాగ్రే వసతే లక్ష్మీ…
కరమధ్యే సరస్వతీ…
కరమూలే తూ గోవిందః…
ప్రభాతే కరదర్శనం!!!
భావం:-
మన చేతివేళ్ళ చివర్లన లక్ష్మీ దేవి, చేతి మధ్యలో సరస్వతీ, ముంజేతి దగ్గర సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి కోలువై యున్నారు.ఈ శ్లోకం చెప్పి రెండు చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ కళ్ళు తెరిచి చేతులను చూడాలి. అంతా మంచే జరుగుతుంది.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...