యువర్ అటెన్షన్ ప్లీజ్… దయచేసి వినండి… రైల్వే స్టేషన్లో వినిపించే గొంతు ఈమెదే..!!
kumar, 20/02/2017.
యువర్ అటెన్షన్ ప్లీజ్… దయచేసి వినండి… ట్రెయిన్ నంబర్… సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్… మరికొద్ది నిమిషాల్లో 1వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చును… అంటూ వచ్చే రైల్వే అనౌన్స్‌మెంట్‌ను వినని వారు బహుశా ఉండరేమో. అది అంతగా పాపులర్ అయింది మరి. దీనికి సంబంధించిన చాలా జోకులను, ఇతర విషయాలను కూడా మనం ఇది వరకే విని ఉన్నాం. అయితే మీకు తెలుసా..? ఆ అనౌన్స్‌మెంట్‌ను చదివే లేడీ వాయిస్ ఎవరిదో..? ఆమె గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది.
ముంబైకి చెందిన ఆమె పేరు సరళా చౌదరి. ప్రస్తుతం ఆమె వయస్సు 49. అది 1982వ సంవత్సరం. సెంట్రల్ రైల్వేలో రైల్వే అనౌన్సర్ ఉద్యోగం కోసం చాలా మంది యువతులు వచ్చారు. ఆ ఉద్యోగానికి జరిగే వాయిస్ టెస్ట్ కోసం సరళా చౌదరి కూడా వెళ్లింది. ఈ క్రమంలో ఆమె గొంతు విన్న అప్పటి జీఎం అశుతోష్ బెనర్జీ సరళా చౌదరి గొంతు నచ్చి ఆమెను సదరు ఉద్యోగం కోసం రికమెండ్ చేశారు. దీంతో అప్పటి నుంచి సరళా చౌదరి రైల్వే అనౌన్సర్‌గా ఉద్యోగం చేస్తూ వస్తోంది. మొదటి నాలుగేళ్లు ఆమె ఉద్యోగం టెంపరరీయే. కానీ 1986లో ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారు.
ఈ క్రమంలో సరళా చౌదరి ఎన్నో రైళ్ల అనౌన్స్‌మెంట్లకు తన గొంతును వినిపించింది. 1991లో ఆలిండియా రేడియోలో అనౌన్స్‌మెంట్ల కోసం ఆమె గొంతును రికార్డు చేశారు. అయితే ఒకప్పుడు కంప్యూటర్లు లేకపోవడంతో ప్రతి అనౌన్స్‌మెంట్‌ను ఆమె చదివి వినిపించాల్సి వచ్చేది. కానీ కంప్యూటర్ల రాకతో రైల్వేల్లోనూ ట్రెయిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టీఎంఎస్)ను ఏర్పాటు చేశారు. దీంతో సరళా చౌదరి తన గొంతుతో ఒకేసారి కొన్ని వేల రికార్డింగ్స్ చేసి ఇచ్చేసింది. వాటిని రైల్వే వారు భద్రపరిచి టీఎంఎస్ అనుసంధానంతో ఆటోమేటిక్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేలా ఇప్పుడు ఏర్పాటు చేశారు. అయితే సరళా చౌదరి గత 12 ఏళ్ల కిందటే తన ఉద్యోగానికి పదవీ విరమణ ఇచ్చేసింది. అయినప్పటికీ ఆమె గొంతు ఇప్పటికీ రైల్వే అనౌన్స్‌మెంట్లలో వినిపిస్తూనే ఉంటుంది. ఆ గొంతును ఆమె స్వయంగా వింటున్నప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనవుతుంటుంది కూడా. ఏది ఏమైనా ఆమెకు ఉన్న మృదువైన కంఠాన్ని, ఆ రైల్వే అనౌన్స్‌మెంట్లను మన జనాలు ఎప్పటికీ మరిచిపోలేరు కదా..!

No comments:
Post a Comment