రూబిక్ క్యూబ్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇవే..!

రూబిక్ క్యూబ్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇవే..!

kumar, 20/02/2017.

రూబిక్ క్యూబ్‌… దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. ఆరు ముఖాలు, 6 రంగులు 9 స్టిక్క‌ర్ల‌తో ఉంటాయి. దీన్ని క‌ల‌పాలంటే అంత ఈజీ కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ క్యూబ్ ఎంత‌గానో పాపుల‌ర్ అయింది. ఒకానొక సంద‌ర్భంలోనైతే దీని అమ్మ‌కాలు కొత్త కొత్త రికార్డులు సృష్టించాయి. అయితే చాలా మందికి రూబిక్ క్యూబ్ సాధించ‌మంటే క‌ష్టం కానీ కొంద‌రు మాత్రం దీన్ని అవ‌లీల‌గా సాధించేస్తారు. అయితే… రూబిక్ క్యూబ్ గురించిన ప‌లు ఆసక్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.


1. బుదాపెస్ట్ లో 1974లో ఓ ఆర్కిటెక్క‌చ‌ర్ యంగ్ ప్రొఫెస‌ర్ రూబిక్ క్యూబ్‌ను పోలిన ఓ వ‌స్తువును త‌యారు చేశారు.

2. అదే వ‌స్తువు 1975లో బుదాపెస్ట్ టాయ్‌గా బొమ్మ‌ల షాపుల్లో ల‌భ్య‌మైంది.

3. రూబిక్ అనే వ్య‌క్తి 1980లో దీన్ని ఇప్ప‌టి 3డీ డైమెన్ష‌న‌ల్ క్యూబ్‌గా త‌యారు చేశాడు. ప్ర‌స్తుతం మ‌నం వాడుతున్న క్యూబ్ అదే. అత‌ని పేరు మీదుగానే దానికి రూబిక్ క్యూబ్ అనే పేరు వ‌చ్చింది.

4. రూబిక్ క్యూబ్‌లో చ‌తుర‌స్రాకారంలో ఉండే చిన్న‌పాటి క్యూబ్‌ల‌ను క్యూబీస్ అని లేదా క్యూబ్‌లెట్స్ అని కూడా పిలుస్తారు.

5. రూబిక్ క్యూబ్‌ను సృష్టించిన రూబిక్‌ను దాన్ని సాల్వ్ చేసేందుకు ఒక నెల ప‌ట్టింద‌ట‌.


6. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూబిక్ క్యూబ్‌లు 350 మిలియ‌న్ల వ‌ర‌కు అమ్ముడైన‌ట్టు అంచ‌నా.

7. ఒక‌ప్పుడు అంటే రూబిక్ క్యూబ్ వ‌చ్చిన కొత్త‌లో 1980ల‌లో ప్ర‌పంచంలో ఉన్న అద్భుత‌మైన ఆట వ‌స్తువుల్లో ఇది 5వ స్థానంలో నిలిచింది.

8. రూబిక్ క్యూబ్‌ను సెక‌న్‌కు ఒక‌సారి చొప్పున తిప్పుతూ పోతే అలా అన్ని కాంబినేష‌న్ల‌ను తిప్ప‌డానికి మీకు 1400 ట్రిలియ‌న్ సంవ‌త్స‌రాలు ప‌డుతుంది.

9. ఆస్ట్రేలియాకు చెందిన ఫీలిక్స్ జెండెగ్స్ అనే వ్య‌క్తి కేవ‌లం 5.66 సెకండ్ల‌లోనే రూబిక్ క్యూబ్‌ను సాధించ‌గా, దాన్ని బీట్ చేస్తూ నెద‌ర్లాండ్స్ కు చెందిన వ్య‌క్తి మాట్స్ వాల్క్ కేవ‌లం 5.55 సెకండ్ల‌లోనే ఆ క్యూబ్‌ను సాధించాడు. అయితే క్యూబ్ స్టార్మ‌ర్ 3 అని కొంద‌రు త‌యారు చేసిన ఓ ప‌రిక‌రం రూబిక్ క్యూబ్‌ను సాధించేందుకు ఎంత స‌మ‌యం తీసుకుందో తెలుసా..? కేవ‌లం 3.253 సెకండ్లు మాత్ర‌మే. అందుకు గాను దాని త‌యారీదారుల‌కు గిన్నిస్ రికార్డు కూడా ల‌భించింది.



10. రూబిక్ క్యూబ్‌ను అంత త‌క్కువ వ్య‌వ‌ధిలో సాధించాలంటే ఎవ‌రైనా కేవ‌లం దాన్ని 20 సార్లు మాత్ర‌మే తిప్పి సాల్వ్ చేయాలి.

11. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన రూబిక్ క్యూబ్ తెనెస్సెలోని నాక్స్‌విల్లెలో ఉంది. దాని బ‌రువు 500 కిలోలు. ఎత్తు 3 మీట‌ర్లు.

12. ప్ర‌పంచంలో అత్యంత చిన్న‌దైన రూబిక్ క్యూబ్ ర‌ష్యాలో ఉంది. దాని త‌యారీదారు పేరు ఎవ్‌జినీ గ్రిగోరీవిస్‌. దాని మందం 10 ఎంఎం మాత్ర‌మే.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...