మంగళవారం గొప్పతనం తెలిస్తే.. ఇక మీదట మంగళవారం గురించి జోకులు వేయరు!!

మంగళవారం గొప్పతనం తెలిస్తే.. ఇక మీదట మంగళవారం గురించి జోకులు వేయరు!!

kumar, 20/02/2017.


మనకి పెద్దలు మంగళవారం కొన్ని పనులు చేయొద్దని నియమం పెట్టారు. ఎందుకు చెయ్యకూడదా అని ఆలోచిస్తే దీంట్లో మర్మం ఏమిటో తెలుసుకోగలుగుతాం. మంగళవారం నాడు మనవాళ్ళు చెయ్యద్దు అన్నటువంటి పనులు ఏంటంటే పనికిమాలిన పనులు, చెడ్డపనులు… అంతేతప్ప మంచిపనులు మంగళవారం చేయచ్చు. మంగళవారాన్ని జయవారం అని కూడా వ్యవహరిస్తారు.

వారాలన్నిటిలోకి కూడా జయాన్ని మీకు కలిగించేటటువంటి వారం మంగళవారం కాబట్టి మంగళవారం నాడు మంచిపని చేస్తే మళ్ళి మళ్ళి మీచేత మంచిపని చేయిస్తుంది. మీరు బ్యాంకులో డబ్బులు వేద్దాం అని అనుకున్నారు అనుకోండి మీ అకౌంట్లో మంగళవారం రోజున డబ్బులు వేసి చూడండి. కచ్చితంగా మీరు డబ్బులు సంపాదించి మరిన్ని అకౌంట్లో వేసేవిధంగా మంగళవారం మిమ్మల్ని అనుగ్రహిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. అందుకని మంచిపని మంగళవారం చేయొచ్చు.. చెడుపని మాత్రం వద్దు.. మంగళవారం మారుకోరుతుంది. మీరు చేసినటువంటి పనిని మళ్ళీ మీ చేత చేయిస్తుంది. మీరు మంచి పని చేస్తే మంచిపని చేయిస్తుంది చెడ్డపని చేస్తే మళ్ళీ వారం తిరిగేలోగా మీచేత చెడ్డపని చేయిస్తుంది. కాబట్టి మంగళవారం విషయంలో మంచి పనులు చెయ్యొచ్చు. చెయ్యకూడని పనులకి కొంత దూరంగా ఉంటే మంగళవారం అనుగ్రహం కలుగుతుంది.

మంగళవారానికి అధిపతి కుజుడు.. కుజుడికి అధిపతి అదిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి మంగళవారం నాడు డబ్బులకి సంబందించినటువంటి పనులు, అప్పులు తీర్చటం లాంటి పనులు చెయ్యండి. అప్పులు చెయ్యకండి ఎందుకంటే మంగళవారం రోజు కనక మీరు అప్పు చేస్తే మళ్ళి కొత్త అప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి మంచిపనులు చెయ్యండి. మిగిలినటువంటి వాటికి దూరంగా ఉండండి.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...