ఇక పై పగటిపూట కూడా వాహనాలకు లైటు వెలగాల్సిందేనని కేంద్రం ఆదేశాలు.. ఎందుకంటే?!
kumar, 20/02/2017.
పొరపాటున పగలు మీ బైక్ పై వెళుతూ, లైటు వేసుంటే, ఎదురుగా వచ్చేవాళ్లు లైట్ వెలుగుతోందని చేతులతో సైగ చేయడం, ఆపై మీరు లైట్ ఆర్పడం సర్వసాధారణమే. ఇక నుండి అలా పగలైనా సరే, బండి లైట్ ఆర్పకూడదు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విచిత్ర నిబంధనల ప్రకారం, బైక్ ఇంజన్ ఆన్ చేస్తే, లైటు ఆన్ ఐయ్యేలా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ (ఏహెచ్ఓ) టెక్నాలజీతోనే బైక్ తయారు చేసి అమ్మాలని కేంద్ర ప్రభుత్వం లేటెస్టుగా ఆదేశాలు జారీ చేసింది. పాత వాహనాలకు మాత్రం ఈ నిబంధన లేదు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఈ పద్ధతి ని అమలు చేస్తారట. మలేషియా, యూరప్ వంటి పలు దేశాల్లో ఈ నిబంధన ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇక అలా లైట్ వెలిగితే ఏమవుతుందంటే..
కాగా, పగలు కూడా లైటు వెలిగే బండ్లు వెళుతుంటే, ప్రతి ఒక్కరూ సైగలు చేయడం ఇబ్బందికరమని వాహనదారులు పేర్కొంటున్నారు. దీనివల్ల బ్యాటరీ త్వరగా డెడ్ అవుతుందని అంటున్నారు. కాగా, ఈ వాదనను కంపెనీలు కొట్టి పారేస్తున్నాయి. బైక్ ఇంజన్ ఆన్ అయితే, ఏసీ సర్క్కూట్ వల్ల లైట్లు వెలుగుతాయని, బ్యాటరీతో సంబంధముండదని టూ వీలర్ కంపెనీలు చెబుతున్నాయి.

No comments:
Post a Comment