స్లిమ్ గా అయ్యేందుకు ఓ కప్పు పెరుగు చాలు
kumar, 20/02/2017.
స్లిమ్ గా అయ్యేందుకు ఓ కప్పు పెరుగు చాలు!!
స్లిమ్‌గా ఉండేందుకు కొంతమంది నానా తంటాలు పడుతుంటారు. అధిక సంఖ్యలో డైట్ కంట్రోల్ చేసి తమ బరువును, బొజ్జను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే మీ బొజ్జ తగ్గి స్లిమ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఎలాగంటే..
* 200 గ్రాముల పెరుగులో దాదాపు 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్‌గా వుండడానికి దోహదపడుతుంది.
* మన శరీరానికి కావాల్సినంత క్యాల్షియం తీసుకోకుంటే శరీరంలో కొవ్వు శాతం బాగా పేరుకుపోతుంది. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయేది కడుపులోనేనన్నవిషయం తెలిసిందే. ఇంకా…
* ఇంతేకాకుండా పెరుగు లేప్టీన్ అనే హార్మోన్‌ను పెంపొందిస్తుంది. ఇది శరీరంలోని శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. పెరుగులోనున్న కాసిన్ని ప్రొటీన్లు కూడా భోజనం చేసామన్న తృప్తినిస్తుంది. అందుకే చాలా మంది భోజనంలో పెరుగుతో తినకుంటే తమకు తిన్నట్టు ఉండదని చెబుతుంటారు. ఈ ఫీలింగ్ వాస్తవికమేనని నిపుణులు చెబుతున్నారు.
* ఇంకో ముఖ్య విషయం.. పెరుగు తీసుకుంటే ఇతరత్రా చిరుతిండ్ల జోలికి పోరంటున్నారు పరిశోధకులు. చిరుతిండ్లు తీసుకుంటే అనాయాసంగా బొజ్జపెరిగి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి శరీరాకృతిని కాపాడుకోవాలనుకుంటే పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్నారు పరిశోధకులు.

No comments:
Post a Comment