అబ్బాయిల్లో టీనేజీ గర్ల్స్ కోరుకునే లక్షణాలివే!

అబ్బాయిల్లో టీనేజీ గర్ల్స్ కోరుకునే లక్షణాలివే!

kumar,16/02/2017.



అమ్మాయిలను ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. కానీ వారు మాత్రం మగాళ్లపై ఈజీగానే ఓ అంచనాకు వస్తారు. తక్కువ సమయంలోనే మన పట్ల ఓ నిర్ధారణకు వస్తారు. అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలకు మంచి హైట్, కలర్ మాత్రమే ఉంటే సరిపోదు. వారు మగాళ్లలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలు తమను ఇష్టపడే అబ్బాయిల్లో ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేదా చూస్తారు. దాదాపు ప్రతి అమ్మాయి కోరుకునే లక్షణాలివేనని ఇటీవలే ఓ సర్వే తేల్చింది

* టీనేజ్ గర్ల్స్ అబ్బాయిల్లో కాన్ఫిడెన్స్ ఎంత మేర ఉందో చూస్తారు. తనపై తాను నమ్మకం ఉంచే అబ్బాయంటే చాలా మంది ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసంతో ఉండేవారు తమను తాము ఇష్టపడటంతోపాటు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారు.
* అబ్బాయిల డ్రెసింగ్‌ను కూడా అమ్మాయిలు ఓ కంట కనిపెడుతుంటారు. మురికిగా ఉండే దుస్తులు వేసుకునే వారంటే అమ్మాయిలకు అసహ్యం. శుభ్రంగా ఉండే దుస్తులు ధరించి, మంచి డియోడ్రెంట్ వాడటంతోపాటు.. చక్కటి షూ ధరించే వారంటే అమ్మాయిలు ఇష్టపడతారు. అబ్బాయిల హెయిర్ స్టయిల్‌ను కూడా గర్ల్స్ గమనిస్తారు.
* ఇక అమ్మాయిలు అమితంగా ఇష్టపడే క్వాలిటీ సెన్సాఫ్ హ్యూమర్. అమ్మాయిలను ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండాలి. ఫన్నీగా ఉంటూ.. జోక్స్ పేల్చే వారంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.
* అమ్మాయిలకు ఖాళీ దొరికితే చాలు తెగ మాట్లాడతుంటారు. ఎదుటి వ్యక్తి తాము చెప్పేది ఓపికగా వినాలని కోరుకుంటారు. ఊరకే ఊకొడితే సరిపోదండోయ్ వారు చెప్పేది విని ప్రశ్నలు అడగాలి.
* పైకి ఎన్ని మాటలు చెప్పినా చూడటానికి బాగుండే అబ్బాయంటే ఏ అమ్మాయైనా ఇష్టపడుతుంది. చిరునవ్వుతో పలకరించే వారంటే వారికి ఇష్టం. అందమైన కళ్లు, చక్కటి మజిల్స్ ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు.
* తెలివైన అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు తేలిగ్గా ఇంప్రెస్ అవుతారు. స్మార్ట్‌గా ఆలోచించే అబ్బాయిలు తేలిగ్గా అమ్మాయిలను అట్రాక్ట్ చేయొచ్చు. మీతో ఉన్నప్పుడు తనకు సెక్యూరిటీ, సెఫ్టీగా ఉన్న ఫీలింగ్ కలిగించడం అనేది చాలా ముఖ్యం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు దాన్ని సాధించాలని, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాలని గర్ల్స్ కోరుకుంటారు.
* ఫ్రెండ్ నుంచి బాయ్ ఫ్రెండ్‌గా మారడానికి కెమిస్ట్రీ ఎంతో అవసరం. కాన్ఫిడెన్స్, ఫిజికల్‌గా ఎట్రాక్టివ్‌గా అబ్బాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ కావాలని టీనేజీ అమ్మాయిలు కోరుకుంటారు. తమను అర్థం చేసుకోవడంతోపాటు పొగిడే వారంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...