సహజ నైపుణ్యాలు పెంచుకోవాలి
గవర్నర్ నరసింహన్
హైదరాబాద్‌లో టాలెంట్ స్ప్రింట్ ‘స్మార్ట్ క్యాంపస్’
kumar, 22/02/2017.
హైదరాబాద్ : ఉద్యోగార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే టాలెంట్ స్ప్రింట్ హైదరాబాద్‌లో స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించింది. ఇందులో ఏకకాలంలో 500 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం ఈ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘నైపుణ్యాల అభివృద్ధికి ప్రస్తుత విద్యా విధానం సహకరించడం లేదు. ఆలోచించే శక్తితో పాటు, ప్రశ్నించే శక్తిని విద్యార్థులు కోల్పోతున్నారు. భవిష్యత్తు తరాలు ఏ మాత్రం మేధస్సుతో అవసరం లేనట్లుగా తయారవుతున్నారు. ఫలితంగా సహజ నైపుణ్యాలు దూరం అవుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం’అన్నారు. సరైన బోధకులు, విద్య ద్వారా మాత్రమే దీన్ని మార్చగలమని పేర్కొన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఛైర్మన్ ఎం.బాలచంద్రన్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారే కాకుండా, ఎక్కడ్నుంచైనా శిక్షణ పొందేందుకు స్మార్ట్ క్యాంపస్ సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉండటం ఉద్యోగార్థులకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ, ఎండీ మనీశ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 1200 కేంద్రాల ద్వారా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. సైయెంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ.. కొత్త అంశాలను నేర్చుకుంటూనే ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. పేరున్న సంస్థలు హైదరాబాద్ నుంచి ఉద్యోగులను తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 190 కాలేజీలు టాస్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. టాలెంట్ స్ప్రింట్ సీఈఓ శంతను పాల్ మాట్లాడుతూ.. ఏడాదికి 4వేల మందికి నేరుగా శిక్షణ ఇచ్చేందుకు ఈ క్యాంపస్‌లో వీలుందని పేర్కొన్నారు.హైదరాబాద్‌లో ఎన్‌పీసీఐ కేంద్రంనగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎన్‌పీసీఐ కృషి చేస్తోందని ఛైర్మన్ ఎం.బాలచంద్రన్ తెలిపారు. ‘భీం’ యాప్‌ను ఇప్పటికే 35లక్షల మంది వాడుతున్నట్లు పేర్కొన్నారు. భారత్ క్యూఆర్ డిజిటల్ చెల్లింపుల్లో కీలకం కానుందన్నారు. యూపీఐ, రూపే కార్డు, ఆధార్ ఆధారిత చెల్లింపులతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎన్‌పీసీఐ ఆపరేషన్స్, ప్రైమ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 300మంది పనిచేస్తున్నారనీ, రానున్న ఐదేళ్లలో 3వేల మంది నిపుణులు పనిచేస్తారని పేర్కొన్నారు.

No comments:
Post a Comment