రిలయన్స్‌ జియో సంచలనం...99కే ఏడాదంతా మాట్లాడండి...డేటాకు నెలకు రూ.303

రిలయన్స్‌ జియో సంచలనం...

kumar, 22/02/2017.


99కే ఏడాదంతా మాట్లాడండి
జాతీయ స్థాయిలో రోమింగ్‌ ఉచితం
డేటాకు నెలకు రూ.303 ఒక టెల
10 కోట్ల మంది చందాదార్లకు రిలయన్స్‌ జియో కానుక
ఏప్రిల్‌ నుంచి అమలు
ముంబయి

రిలయన్స్‌ జియో అమలు చేస్తున్న ఉచిత పథకాల గడువు మార్చి ఆఖరుతో ముగియనున్న తరుణంలో, ఎలాంటి కొత్త పథకాలు ప్రకటిస్తారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చందాదారులకు, సాంత్వన కలిగించే ఆకర్షణీయ పథకాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ ప్రకటించారు. సగటు ఆదాయ వర్గీయులు కూడా, నిశ్చింతగా అపరిమిత కాల్స్‌ చేసుకునేలా, అత్యధిక వేగంతో- అపరిమిత డేటాను అతి తక్కువ మొత్తానికే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించే పథకాలను ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నట్లు మంగళవారం ముకేశ్‌ ప్రకటించారు. కంపెనీ సామాజిక మాధ్యమ ఖాతాదార్లకు ముకేశ్‌ అంబానీ ప్రపంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించారు. దేశవ్యాప్త సేవలు ఆరంభించిన సెప్టెంబరు 5 నుంచి 170 రోజుల వ్యవధిలోనే 10 కోట్ల మందికి పైగా చందాదార్లు రిలయన్స్‌ జియోకు సమకూరారని, సంస్థపై వారు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా, నూతన పథకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మరే ఇతర టెలికాం సంస్థల కంటే కూడా, ప్రతి పథకంలోనూ తమ చందాదార్లకు 20 శాతం డేటాను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సెకనుకు ఏడుగురు కొత్త చందాదారులు
‘దేశవ్యాప్తంగా అత్యధిక వేగం డేటా (4జీ) సేవలను ప్రారంభించిన రిలయన్స్‌ జియోను మొబైల్‌ వినియోగదారులు అమితంగా ఆదరించారు. సగటున చూస్తే, రోజులో ప్రతి సెకనుకు 7 కొత్త కనెక్షన్లు అందించాం. తద్వారా 170 రోజుల్లోనే చందాదార్ల సంఖ్య 10 కోట్లు దాటింది. ప్రపంచంలో మరే సాంకేతిక అంకుర సంస్థ ఇంతటి ఘనత సాధించలేదు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు కూడా ఇంత వేగంగా చందాదార్లు సమకూరలేదు’ అని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.



డేటా వినియోగంలో మనదేశమే నెంబర్‌ వన్‌
‘గతంలో డేటా వేగం తక్కువగా ఉండటం వల్ల, డేటా వినియోగంలో భారత్‌ స్థానం దిగువన ఉండేది. అత్యాధునిక జియో 4జీ నెట్‌వర్క్‌లో డేటా సగటు వేగం గరిష్ఠస్థాయికి చేరినందున, మొబైల్‌లో డేటా వినియోగమూ తారాస్థాయికి చేరింది. దేశంలోని అత్యధిక 4జీ స్మార్ట్‌ఫోన్లలో, డేటా వినియోగానికి జియో సిమ్‌నే వినియోగిస్తున్నారు. వీడియోలు వీక్షించేందుకే జియో చందాదార్లు అత్యధిక డేటా వాడారు. జియో నెట్‌వర్క్‌పై చందాదార్లు వాడిన డేటా, అమెరికా వినియోగానికి సమాన స్థాయికి చేరింది. చైనా మొత్తం చందాదార్లు వాడిన డేటా కంటే, 50 శాతం అదనంగా వాడరు. మొత్తంమీద మొబైల్‌ డేటా వినియోగంలో, ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానానికి చేరింది’ అని ముకేశ్‌ అంబానీ సగర్వంగా ప్రకటించారు.

డిసెంబరు కల్లా ప్రతి గ్రామం, పట్టణానికీ చేరతాం
‘రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు అధునాతనంగా, వేగవంతంగా, పటిష్టంగా తీర్చిదిద్దుతున్నాం. రాబోయే కొన్ని నెలల్లో, డేటా సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాం. ఇందువల్ల వినియోగదార్లకు మరింత నాణ్యమైన సేవలు లభిస్తాయి. ఈ ఏడాది డిసెంబరు ఆఖరు కల్లా, దేశంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరానికీ చేరతాం. దేశంలోని 99 శాతం మంది ప్రజలకు 4జీ సేవలు అందిస్తాం’ అని ముకేశ్‌ ప్రకటించారు.


ఇప్పటి వరకు అమలువుతున్న జియో ఆఫర్లు
అపరిమిత కాల్స్‌.. అత్యధిక వేగంతో అపరిమిత డేటా .. పూర్తి ఉచితంగా అంటూ సెప్టెంబరు 5న దేశవ్యాప్త సేవలకు శ్రీకారం రిలయన్స్‌ జియో, 2016 డిసెంబరు 31 వరకు ఆ పథకాలను ‘ప్రారంభ ఆఫర్‌’ కింద అమలు చేసింది. జియో అప్లికేషన్లు, సినిమాలు, టీవీ ప్రసారాలు, సంగీతం.. ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా అందించింది. చందాదార్లు రోజుకు 4జీబీ డేటాను ఉచితంగా వినియోగించుకోగలిగారు.

* అనంతరం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, ఆఫర్లలో స్వల్ప మార్పులు చేసింది. కాల్స్‌, ఇతర సేవలన్నీ పూర్తి ఉచితంగా కొనసాగించడమే కాకుండా, 2017 జనవరి 1 నుంచి రోజుకు డేటా పరిమితిని 1 జీబీకి పరిమితం చేసింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఇది అమలవుతుంది.

రోజుకు 1 జీబీ డేటా రూ.10కేప్రస్తుత చందాదారులు మార్చి 1 నుంచి 31 మధ్య రూ.99 చెల్లిస్తే, రిలయన్స్‌ జియో ప్రాథమిక సభ్యత్వం (ప్రైమ్‌ మెంబర్‌షిప్‌) లభిస్తుంది. మై జియో యాప్‌ ద్వారా,www.jio.com వెబ్‌సైట్‌లోనూ, విక్రయశాలలకు వెళ్లి ఈ మొత్తం చెల్లించవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2018 మార్చి 31 వరకు వీరు కాల్స్‌ అన్నీ ఉచితంగా చేసుకోవచ్చు. దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా, ఎస్‌టీడీ కాల్స్‌ అయినా అపరిమితంగా చేసుకోవచ్చు. జాతీయస్థాయిలో రోమింగ్‌ ఛార్జీలు కూడా ఉండవు.

ఒక టెలికాం సర్కిల్‌ పరిధిలోని వారు, ఇతర సర్కిళ్ల (రాష్ట్రాల)కు వెళ్లినా, కాల్స్‌ చేసుకోడానికి, అందుకోడానికి ఛార్జీలు ఏమీ పడవు.

* డేటా కూడా అపరిమితంగా వాడుకోవాలంటే, నెలకు రూ.303 చొప్పున చెల్లించాలి. రోజుకు 1జీబీ డేటా అత్యధిక (4జీ) వేగంతో, అనంతరం పరిమిత వేగంతో, అపరిమితంగా వాడుకోవచ్చు. అంటే రోజుకు రూ.10కే 1జీబీ డేటా లభిస్తుందన్నమాట. రూ.10,000 విలువైన జియో అప్లికేషన్లన్నీ 2018 మార్చి ఆఖరు వరకు ఉచితంగా వాడుకోవచ్చని సంస్థ తెలిపింది.


No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...