కెప్టెన్‌గా ధోని!
kumar, 22/02/2017.
న్యూదిల్లీ: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని త్వరలో కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అవును మీరు విన్నది నిజమే. కాకపోతే భారత క్రికెట్ జట్టుకు మాత్రం కాదు. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో ఝార్ఖండ్ జట్టుకు అతడునాయకత్వం వహిస్తాడు. గత రెండు సీజన్లలోనూ ఝార్ఖండ్ తరపున ఆడినా నాయకత్వం మాత్రం వహించలేదు. ధోని కెప్టెన్సీతో ఝార్ఖండ్ జట్టు మరింత బలంగా తయారవుతుందని భావిస్తున్నారు. అతనితో పాటు కీలక ఆటగాళ్లు ఇషాన్ కిషన్, షబాజ్ నదీం సైతం జట్టులో ఉన్నారు.
రెండేళ్ల కిందట హఠాత్తుగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని, ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతలనూ వదిలేశాడు. తాజాగా ఐపీఎల్ జట్టు పుణె సూపర్ జెయింట్స్ ధోనికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి స్టీవెన్ స్మిత్‌కు అప్పగించింది.
ఝార్ఖండ్ జట్టు: ధోని(కెప్టెన్), ఇషాన్ కిషన్, ఇషాంక్ జాగి, విరాట్ సింగ్, సౌరభ్ తివారీ, కుషాల్ సింగ్, ప్రత్యూష్ సింగ్, షబాజ్ నదీం, సోనుకుమార్ సింగ్, వరుణ్ అరోన్, రాహుల్ సుక్లా, అనుకుల్ రాయ్, మోను కుమార్ సింగ్, జస్కరన్ సింగ్, ఆనంద్ సింగ్, కుమార్ దియోబ్రాత్, ఎస్.రాథోడ్, వికాస్ సింగ్

No comments:
Post a Comment