ఇలా చేస్తే నిమిషాల్లో పాన్ కార్డు మీ చేతికొస్తుంది!!
kumar,17/02/2017.
పెద్ద నోట్ల రద్దు నుంచి దేశ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. పన్ను చెల్లించకుండా పెద్ద మొత్తంలో సంపాదించే వారి వివరాలు రాబట్టేందుకు ఇప్పుడు ఐటీ డిపార్టు మెంట్ పని సులువైంది. ఇందుకోసం ప్రతి బ్యాంకు ఎకౌంట్ కు పాన్ కార్డు ఎటాచ్ చేయడం తప్పనిసరి అనే నిబంధన విధించింది. ఈనెలాఖరు కల్లా దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల పాన్ నంబర్లు ఎకౌంట్లకు జమచేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాన్ కార్డుల కోసం కోట్లల్లో అప్లికేషన్లు వస్తున్నాయి.. అయితే ఆదాయపు పన్ను శాఖ జారీచేసే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్ కార్డు) కోసం ఇక రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదని ఆశాఖ చెబుతోంది. నిమిషాల్లో పాన్ కార్డు ఇక మీ ముందుకు రాబోతుంది. అది ఎలాగంటే..
ఇన్ కమ్ ట్యాక్స్ ను స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లించేలా అవకాశం కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. పన్ను చెల్లింపుదారులకు సులువుగా ఆధార్ కార్డు ఈ-కేవైసీ ఫెసిలిటీ ద్వారా పాన్ కార్డును జారీచేసేలా ప్రణాళికలు రూపొందిస్తుంది కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల బోర్డు. ఒకవేళ సిమ్ ను ఈ-కేవైసీ ద్వారా జారీచేస్తే, పాన్ కార్డు కూడా ఇవ్వడం కుదురుతుందని చెపుతున్నారు అధికారులు. ప్రస్తుతం రెండు, మూడు వారాలు పడుతున్న ఈ పని ఇక ఐదు లేదా ఆరు నిమిషాల్లోనే పూర్తవుతుందని చెపుతున్నారు అధికారులు. మొదట నెంబర్ జారీచేసి, తర్వాత కార్డు డెలివరీ చేసేలా చూస్తున్నారు.

No comments:
Post a Comment