kumar,13/02/2017.
నిరుద్యోగ ఉపాధ్యాయ పట్టభద్రులకు గురుకుల విద్యాసంస్ధలలో కోలువుల ప్రకటన సువర్ణావకాశంగా చెప్పవచ్చు. దీన్ని సద్వినియెగం చేసుకోవడానికి గరిష్ఠ కృషి అవసరమవుతుంది. నియామక పరీక్షలో నెగ్గటం కోసం పకడ్బందీ ప్రణాళికతో అభ్యర్థులు సన్నద్ధం కావాలి!
పేద విద్యార్థిలు ఎక్కువగా చదివే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిచాలనే లక్షలతో భారీస్ధాఇలో ఉద్యోగుల బర్తీ జరుగుతోంది. మంచి వేతనంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి పోటీ తీవ్రస్ధాఇలో ఉండటం సహజం.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో PGT,TGT,PET,PD,ARTS,CRAFT,MUSIC,LIBRERIAN,STAFF NURSE ఉద్యోగాల నియామకం జరగబోతుంది. మహాత్మా జ్యోతిబాపుతే బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్ధల సొసైటీ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్ధల సొసైటీ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్ధల సొసైటీ, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్ధల సొసైటీ, తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్ధల సొసైటీల ఆధ్వర్యంలోని విద్యాలయాల్లో వివిధ స్ధాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
● జోన్ స్ధాయిలో నియామకాలు జరుగుతాయి.
జోన్-5 లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలున్నాయ్; జోన్ - 4 లో రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలున్నాయ్.
● నియామకాలు స్థానిక, స్ధానికేతర(నాన్-లోకల్) నిష్పత్తి లో జరుగుతాయి.
● అభ్యర్థులు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన ప్రాంతం/జిల్లా ఆధారంగా జోన్ ను నిర్ణయిస్తారు. (గమనిక : సాధారణంగా డీఎస్సీ ద్వారా జరిగే ఉపాధ్యాయ నియామకాలు జిల్లా యూనిట్ గా జరుగుతాయి).
పరీక్ష విధానం :
PGT,TGT, PD ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష, ప్రధాన పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షగానో, ఆఫ్ లైన్ ఓఎంఆర్ పద్ధతినో పరీక్ష జరుగుతుంది.
● పరీక్ష పత్రాలు ఆంగ్లమాధ్యమంలో ఉంటాయి.
● అభ్యర్థుల వయస్సు : 01/07/2017 నాటికి 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల వరకు.
SC/ST,BC లకు 5 సం. PH లకు 10 సం. గరిష్ఠ వయః పరిమితి సడలింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసుననుసరించి గరిష్టంగా 5 సం. సడలింపు ఇస్తారు.
ఫీజు :
ఆన్ లైన్ దరఖాస్తు ప్రాసెస్ ఫీజు రూ.200/-. దీనికి అదనంగా రూ.120/- పరీక్ష ఫీజు చెల్లించవలసి ఉంటుంది. SC/ST,BC,PH వర్గాల వారికి, 18 సం. నుంచి 44 సం. మధ్య వయస్సు నిరుద్యోగ అభ్యర్థులకూ పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. ఫీజును ఆన్ లైన్ ద్వారా SBI ఈమేరకు ద్వారా చెల్లిచవచ్చు.
సహాయ కేంద్రం :
దరఖాస్తు ఆన్ లైన్ లో సమర్పించటం, హాల్ టికెట్లు పొందడం, ఇతర సాంకేతిక సమస్యల సందేహ నివృత్తి కోసం 040-23120301,040-23120302 ఫోన్ నంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదిచవచ్చు.
● దరఖాస్తు చేయటానికి ఆన్ లైన్ పద్ధతిని అనుసరించాలి.
● వెబ్ సైట్ : http://www.tspsc.gov.in
● దరఖాస్తు ఆన్ లైన్ లో నింపటానికి ఈ ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాల్సివుంటుంది.
1) study certificate
2) date of birth certificate/ssc certificate
3) school study certificate
4) community certificate
5) పాఠశాలలో రెగ్యులర్ గా చదివిన వారూ, ప్రైవేటుగా చదివినవారూ రెసాడెన్స్ సర్టిఫికెట్ ను వెరిఫికేషన్ సమయంలో పొందుపరచవలసి ఉంటుంది.
ఎంపిక విధానం :
● ప్రిలిమినరీ/స్క్రీనింగ్ టేస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
ఇందులో ప్రతిభ చూపినవారిని 1:15 నిష్పత్తి లో ప్రధాన పరీక్ష కు ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షలోని మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.
మెయిన్ పరీక్ష సమయం :
paper -1, 150 marks,
2:30 Time
paper- 2, 150 marks,
2:30 Time.
all the best for become a teachers.
No comments:
Post a Comment