క్యాన్సర్ కోరల్లో మహిళలు...మహిళలకు రోమ్ము క్యాన్సర్ అత్యధికంగా వస్తుందట.ఈ విధంగా గుర్తించండి.

క్యాన్సర్ కోరల్లో మహిళలు...

kumar,12/02/2017.


క్యాన్సర్ కోరల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారని తాజా పరిశోధనలో తేలింది. అయితే

• ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికిత్సల్లో 88% వారివే.
• ఏటా రెండు శాతం పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు.
• హైదరాబాద్ లోనే అత్యధికం.
• ఇతర రకాల క్యాన్సర్లు  గ్రామీణంలో  ఎక్కువ.
• ముందస్తు గుర్తింపుతో మేలంటున్న నిపుణులు.

article : తెలంగాణలో  మహిళలు క్యాన్సర్ కోరల్లో చిక్కుకుని  అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ చికిత్సలు చేయించుకుంటున్న వారిలో 88% మహిళలే కావడం. గమనార్హం. 2014 - 2015 లో 54,898 క్యాన్సర్ చికిత్సలు కాగా జరగ్గా 2015 - 2016 కు 62,606 కు (14%) పెరిగాయి.  2016 - 2017 లో ఇప్పటి వరకూ 52,168 చికిత్సలు జరిగాయి.

తెలంగాణ లో  క్యాన్సర్ ఉద్ధృతిపై  ప్రత్యేక కథనం.

తెలంగాణ లో రొమ్ము క్యాన్సర్ బాధితులు  ఏటా 2 శాతం పెరుగుతున్నాయ్. గత మూడేళ్ల లో అత్యధికంగా హైదరాబాద్ లో 4,505 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇతర క్యాన్సర్ కేసులు అత్యధికంగా తెలంగాణ గ్రామీణంలో నమోదవుతున్నాయ్. వరంగల్ జిల్లాలో మూడేళ్ల  లో 4,568 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చికిత్సలు నమోదవగా నోటి క్యాన్సర్ కేసులు కరీంనగర్ అగ్రభాగాన ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలున్నాయ్.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు కారణాలు :
● 'హ్యూమన్ పారిలోమా వైరస్  (హెచ్ పి వి)' ద్వారా ఈ క్యాన్సర్ సోకుతుంది.
● మర్మావయవలను అపరిశుభ్రంగా ఉంచుకోకపోవడం.
● పదే పదే సుఖవ్యాధులు సోకడం.
● పౌష్టికాహార లోపించడం.
● 18 ఏళ్లలోపే  పెళ్ళి కావడం, పిల్లలు పుట్టడం.

రొమ్ము  క్యాన్సర్ కు కారణాలు :

● ఆలస్యంగా  పెళ్లి  చేసుకోవడం.
● 35 ఏళ్లు దాటాక గర్భధారణ
● పిల్లలు లేకపోవడం.
● తల్లిపాలు బిడ్డకు పట్టకపోవడం.
● జన్యుపరంగా. 

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...