కొత్త వాహనాల కొనుగోలుకు రూ.6 లక్షల వరకు ప్రభుత్వ రాయితీ!

కొత్త వాహనాల కొనుగోలుకు రూ.6 లక్షల వరకు రాయతి!
kumar,12/02/2017.



 article : 15 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియలో భాగంగా కొత్త వాహనం కొనుగోలు కు రూ.6 లక్షల  వరకు రాయితీ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా,నౌకాయన మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తోలుత వాహన యజమానికి రూ. లక్ష నుంచి రెండులక్షల వరకు కొత్త వాహన కంపెనీ ద్వారా  రాయితీ ఇప్పిస్తామని వెల్లడించారు.  తుక్కు ద్వారా మరో రూ.2 లక్షల  వరకు అందుతుందన్నారు. కొత్త వాహనాల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు పన్ను రాయితీ కల్పిస్తామన్నారు. దీని వల్ల  కొత్త వాహనం కొనడానికి దాదాపు రూ. ఆరు లక్షల  వరకు రాయితీ లభించినట్లవుతుందని, కొత్త వాహనాల వల్ల దేశంలో  65% కాలుష్యం తగ్గిపొతుందన్నారు.

వాహన రంగంలోనూ వేగం పుంజుకుంటుందని వివరించారు. శుక్రవారం దిల్లీలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. తుక్కు వాహనాల మార్పిడి అంశంపై ఈ నెల 9 న కేబినెట్ కార్యదర్శితో చర్చిచనున్నట్లు చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విధాన పత్రాన్ని ఆర్థిక మంత్రికి సమర్పించినట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు పై పన్ను రాయితీలు కల్పించే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తున్నందున దీనిపై మంత్రిమండలి ఆమోదం పొందాక జీయస్టి సమావేశంలో ప్రతిపాదిస్తామన్నారు. బంకింగ్ హాం కెనాల్ ప్రాజెక్టు పనులను రూ.2 వేలకోట్ల ఖర్చుతో నెలలోపు మెదలుపెడతామని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కృష్ణా,గోదావరి నదుల మీదుగా ఆంధ్ర, తమిళనాడుల మధ్య చవకైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...