7రోజులు క్రమం తప్పక కొబ్బరి నీళ్ళు తాగితే ఉహించని ఆరోగ్య లాభాలు తెలుసుకోండి!!
kumar, 21/02/2017.
చాలామందికి ఎండలో బాగా తిరిగినా బాగా అలసటగా అనిపించినా వెంటనే గుర్తొచ్చేది కొబ్బరి బోండాం. మార్కెట్లో ఎన్నో రకాల శీతలపానీయాలు దొరుకుతున్నా దాహార్తిని తీర్చి మెరుగైన ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది కొబ్బరి బోండాం మాత్రమే. ప్రకృతి నుంచి లభించే కొబ్బరి బొండా నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరి బొండాం నీటిని వారం క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు.
* నిత్యం కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి తోడ్పడుతుంది.
* శీతాకాలంలో కూడా కొబ్బరి బోండాం తాగడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది.
* కొబ్బరిబొండాన్ని వారం పాటు తీసుకుంటే ఇంతకు ముందు లేని ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపి తగ్గుతాయి.
* కొబ్బరి బోండాం నిత్యం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. షుగర్ పేషెంట్లు కూడా డాక్టర్ల సలహా మేరకు కొబ్బరి బోండాం తాగడం మంచిది.
* శరీరానికి కావలసిన ఫైబర్‌ను కొబ్బరిబొండాంలోని నీళ్లు అందిస్తాయి.
* వారం రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బోండాం తాగితే బాడీలో కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
* కొబ్బరినీళ్లు తాగితే డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
* చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులపాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది.
* తల్లి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదల చక్కగా ఉంటుంది.
* గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు తగ్గి, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
* కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపరచడానికీ తోడ్పడతాయి.
* కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం తగ్గి, వయసు తక్కువగా కనపడుతుందంటున్నారు బ్యూటీషియన్లు.

No comments:
Post a Comment