పాడె పైనుంచి లేచి కూర్చున్న 17యేళ్ల కుర్రాడు.. జనం భయంతో పరుగు!!
kumar, 21/02/2017.
చనిపోయాడు.. ఇక ఏం లేదు అంత్యక్రియలు చేసి రావడమే అనుకున్న వ్యక్తి లేచి కూర్చుంటే ఇక చుట్టూ ఉన్న వాళ్ల గతి ఏమవుతుందో ఓసారి ఊహించుకోండి.. ఇదేదో సినిమా స్టోరీ కాదు. నవలలోని కథ అంతకంటే కాదు. కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో చనిపోయాడని భావించిన ఓ టీనేజ్ కుర్రాడు అంత్యక్రియల్లో కళ్లుతెరిచాడు. మనగుండి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బంధువులతో పాటు గ్రామస్తులు భయాందోళన చెందారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 17 ఏళ్ల కుమార్ మరేవాద్ చదువు మధ్యలోనే ఆపేశాడు. కూలి పనులు చేసుకుని పొట్టపోసుకునే అమ్మానాన్నలకు తోడుగా పనులకు పోతున్నాడు. ఇటీవల ఈ కుర్రాణ్ణి ఓ కుక్క కరిచింది. ఆ తర్వాత ఓ 15 రోజులకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా కండిషన్ సీరియస్ గా ఉందని వెంటిలేటర్ పెట్టారు. కాగా శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ ప్రబలినందున కోలుకోవడం కష్టమనీ, వెంటిలేటర్ తీసేస్తే బతకడని డాక్టర్లు అతడి బంధువులకు చెప్పారు.
దీంతో ఆ కుటుంబం అతడిని ఇంటికి తీసుకెళ్లారు. శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడం, శ్వాసకూడా తీసుకోకపోవడంతో చనిపోయినట్టు భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఊరికి 2కిలోమీటర్ల దూరంలో స్మశానానికి మోసుకెళ్తున్నారు. ఇంకా కొద్దిగా అడుగులు వేస్తే స్మశానానికి చేరుకుంటారనగా కుమార్ ఒక్కసారిగా కళ్లుతెరిచాడు. కాళ్లూ చేతులు ఆడిస్తూగట్టిగా శ్వాసపీల్చడం మొదలుపెట్టాడు. అది చూసి ఏదో జరగరానిది జరిగిందని బంధువులు, కుటుంబీకులు ఒక్కసారిగా పరుగు లంకించుకున్నారు. కాసేపు భయంతో పాడె వద్దకు వెళ్లేందుకు సైతం వెనుకాడారు. ఆ తర్వాత తేరుకుని కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు అతడు ఆరోగ్యంతోనే ఉన్నాడని వైద్యులు చెప్పారు. చికిత్స చేస్తే బతికే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.

No comments:
Post a Comment