ఇల్లులేని నిరుపేదలకు పండగలాంటి వార్త ఇది..
kumar,16/02/2017.
సాధారణ, మధ్యతరగతి వర్గాలకు 2022కల్లా అందరికీ సొంత ఇల్లు అనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే రూ.1000లు చెల్లిస్తే చాలు ఇంటిని మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1.2లక్షల ఇళ్లను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ముందు రూ.వెయ్యి చెల్లించగానే గృహాన్ని శాంక్షన్ చేసి మిగిలిన మొత్తాన్ని సులభ వాయిదాలపై తీర్చేలా బ్యాంకు రుణం ఇప్పిస్తారు. ఒక్కో ఇంటికి లబ్ధిదారుకి రూ.3లక్షల రాయితీని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పరిధిలో చేపట్టనున్న ఈ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రతీవారం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు.
మంగళవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏపీ పట్ణణాభివృద్ధి మంత్రి పి.నారాయణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ‘‘గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులతోపాటు ఆసుపత్రి, వాణిజ్య సముదాయం, కమ్యూనిటీ హాల్ తదితర సదుపాయాల్ని కల్పిస్తాం. నిర్వహణకు ప్రత్యేకంగా సొసైటీని ఏర్పాటుచేస్తాం.. ఒక్కో ఇంటికీ రూ.30వేలు చొప్పున అందులో డిపాజిట్ చేస్తాం. మూడు రకాల విస్తీర్ణాల్లో ఇళ్లను నిర్మించనున్నాం. మొదటిది 270చ.అడుగుల్లో హాల్, బెడ్ రూం నిర్మించి ఇస్తాం. మరో రకం 365 చ.అడుగుల్లో హాల్, పడకగది వేర్వేరుగా ఉంటాయి. 420 చ.అడుగుల్లో రెండు పడకగదులు, హాల్‌తో నిర్మిస్తాం. ఈ మూడింటిలోనూ వంట గది, మరుగుదొడ్డి ఉంటాయి. వీటికి లబ్ధిదారు ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి టైల్స్, గోడలకు పుట్టి పెట్టించుకోవచ్చు. 270చ.అడుగుల ఇంటికి రూ.వెయ్యి కడితే మంజూరు చేస్తాం. 365 చ.అడుగులైతే రూ.25వేలు, ఇదే ఇల్లు అన్ని హంగులతో కావాలనుకొంటే రూ.50వేలు కట్టాలి. ఇందుకు ఏడాది గడువుంటుంది. 420చ.అ. విస్తీర్ణంలో పూర్తి హంగులతో ఇల్లు కావల్సినవాళ్లు రూ.లక్ష చెల్లించాలి.’’ అని చెప్పారు.

No comments:
Post a Comment