Lok Sabha Recruitment 31 posts,Jobs in National FertilizersWalk-ins in IIT Bombay,Research Fellowships in ARDE. లోక్‌సభలో 31 పోస్టులు, నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు, ఐఐటీ బాంబేలో వాక్-ఇన్, ఏఆర్‌డీఈలో రిసెర్చ్ ఫెలోషిప్స్.

Lok Sabha Recruitment 31 posts,Jobs in National FertilizersWalk-ins in IIT Bombay,Research Fellowships in ARDE. లోక్‌సభలో 31 పోస్టులు, నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు, ఐఐటీ బాంబేలో వాక్-ఇన్, ఏఆర్‌డీఈలో రిసెర్చ్ ఫెలోషిప్స్.

లోక్‌సభలో 31 పోస్టులు,

లోక్‌సభ సెక్రటేరియట్‌లో 31 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
loksabha
వివరాలు:

పార్లమెంట్ ఆఫ్ ఇండియాలోని జాయింట్ రిక్రూట్‌మెంట్ సెల్ ఈ పోస్టులను భర్తీ చేస్తుంది.
-పోస్టులు: జూనియర్ క్లర్క్
-మొత్తం ఖాళీల సంఖ్య - 31. వీటిలో ఎస్సీ - 1, ఎస్టీ -5, ఓబీసీ - 9, జనరల్ - 16 ఖాళీలు ఉన్నాయి. 26 ఇంగ్లిష్ స్ట్రీమ్‌లో, 5 హిందీ/బైలింగ్వల్ స్ట్రీమ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక పోస్టు విజువల్లీ హ్యాండీక్యాప్డ్ (లోవిజన్)కు కేటాయించారు.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్‌లో నిమిషానికి కనీసం 40 పదాలు (హిందీ/ఇంగ్లిష్) టైపింగ్‌చేసే సామర్థ్యం ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండటం అభిలషణీయం.
-వయస్సు: 27 ఏండ్లు మించరాదు
-ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారిని మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపికచేస్తారు. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: http://www.loksabha.-ic.i-


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు,

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
National-Fertilizers

వివరాలు:

ఎన్‌ఎఫ్‌ఎల్ భారత ప్రభుత్వరంగ సంస్థ
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్)
-ఖాళీల సంఖ్య - 10
-పేస్కేల్: రూ. 20, 600 - 46,500/-
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఎం కోర్సు ఉత్తీర్ణత. పై కోర్సుల్లో మార్కెటింగ్ లేదా అగ్రి బిజినెస్ స్పెషలైజేషన్‌తో చదివి ఉండాలి.
-వయస్సు: 2017, మార్చి 31నాటికి 40 ఏండ్లు మించరాదు
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ఫీజు: రూ. 700/-
-దరఖాస్తు: తెల్లపేపర్ మీద బయోడేటా రాసి సంబంధిత అర్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను జతచేసి పంపాలి.
-చివరితేదీ: ఆగస్టు 1
-వెబ్‌సైట్: http://www.-atio-alfertilizers.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ బాంబేలో వాక్-ఇన్,
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే) ఖాళీగా ఉన్న జూనియర్ మెకానిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iit-bombay
వివరాలు

ఐఐటీ బాంబే దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ.
-జూనియర్ మెకానిక్ (ఎలక్ట్రికల్)
-పోస్టుల సంఖ్య: 5 (జనరల్- 4, ఎస్సీ-1)
-అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి, సంబంధిత రంగంలో రెండేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-జూనియర్ మెకానిక్ (మెకానికల్)
-పోస్టుల సంఖ్య: 1
-అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా, సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. లేదా ఐటీఐలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఐదేండ్లు పనిచేసిన
అనుభవం ఉండాలి.
-వయస్సు: 27 ఏండ్లు నిండినవారై ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ. 2000
-అప్లికేషన్ ఫీజు: రూ. 50, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీలకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, రాతపరీక్ష
-ఎంపిక తేదీలు: ఆగస్టు 8, 11
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 28
-వెబ్‌సైట్: www.iitb.ac.i-




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఆర్‌డీఈలో రిసెర్చ్ ఫెలోషిప్స్.

పుణెలోని ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ) వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిసెర్చ్ ఫెలోషిప్స్ ( రెండేండ్ల కాల పరిమితి) కోసందరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:

ఏఆర్‌డీఈ డీఆర్‌డీవో పరిధిలో పనిచేస్తుంది.
-జేఆర్‌ఎఫ్ (మెకానికల్): 4 ఖాళీలు
-విద్యార్హతలు: బీఈ లేదా బీటెక్ (మెకానికల్ లేదా మెటలర్జీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. నెట్ లేదా గేట్ క్వాలిఫై అయి ఉండాలి. లేదా ఎంఈ లేదా ఎంటెక్ (మెకానికల్ లేదా మెటలర్జీ ఇంజినీరింగ్)లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ రెండు స్థాయిల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
-స్టయిఫండ్: నెలకు రూ.25,000
-జేఆర్‌ఎఫ్ (ఫిజిక్స్): 1 ఖాళీ
-విద్యార్హతలు: ఎంఎస్సీ (ఫిజిక్స్ లేదా అప్లయిడ్ ఫిజిక్స్)లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవడంతోపాటు నెట్ లేదా గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. లేదా ఎంటెక్ (అప్లయిడ్ ఫిజిక్స్, ఆప్టోఎలక్ట్రానిక్స్)లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
-స్టయిఫండ్: నెలకు రూ.25,000.
-జేఆర్‌ఎఫ్ (ఏరోనాటికల్): 2 ఖాళీలు
-విద్యార్హతలు: బీఈ లేదా బీటెక్ (ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఇంజినీరింగ్) లేదా ఎమ్మెస్సీ (మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతోపాటు 10+2 స్థాయిలో సీ, సీ++ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకుని ఉండాలి. నెట్/గేట్‌లో అర్హత పొంది ఉండాలి.
-స్టయిఫండ్: నెలకు రూ.25,000.
-వయస్సు: పై అన్ని ఫెలోషిప్స్‌కు ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏండ్ల లోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
-ఇంటర్వ్యూ తేదీ: జూలై 15
-ఇంటర్వ్యూ ప్రదేశం: ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), ఆర్మమెంట్ పోస్ట్, పాశాన్, పుణె-411021.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...