జియో మరో సరికొత్త సంచలనం!!
kumar,16/02/2017.
ఫ్రీ డేటా, కాలింగ్ ఆఫర్ల
ఫ్రీ డేటా, కాలింగ్ ఆఫర్లతో పోటీ టెలికం సంస్థలకు చుక్కలు చూపిస్తూ దేశం మొత్తం రిలయన్స్ జియో బాట పట్టేలా చేసిన సంస్థ ఇప్పుడు మరో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటి దాకా మన ఫోన్ నెంబర్ లు 9, 8, 7 సిరీస్ తో మొదలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ జియో సరి కొత్త సిరీస్ తో మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈ మేరకు రిలయన్స్ కు కొత్తగా ‘6’ అంకెతో మొదలయ్యే సెల్ ఫోన్ నంబర్ సిరీస్ ను ఇచ్చేందుకు డాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో మరి కొన్ని రోజుల్లో ‘6’ అంకెతో మొదలయ్యే సెల్ ఫోన్ నంబర్లను జియో తన వినియోగదారులకు ఇవ్వనుంది.
No comments:
Post a Comment