కొద్దిరోజులు బాయ్‌ఫ్రెండ్స్‌గా ఉంటారా ప్లీజ్.. వేల మంది అమ్మాయిలు��...

కొద్దిరోజులు బాయ్‌ఫ్రెండ్స్‌గా ఉంటారా ప్లీజ్.. వేల మంది అమ్మాయిలు��...

kumar, 25/02/2017.


ఆ అమ్మాయిలు పాతికేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇంకా కొంతకాలం స్వేచ్ఛా జీవితాన్ని గడపాలనుకుంటున్నారు . భర్తపైన ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడగలమని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. కానీ.. వివాహం జరిపించడం తల్లిదండ్రుల బాధ్యత కదా. అందుకే ‘మంచి వరుడిని చూస్తాం వివాహం చేసుకో, లేదా ప్రేమిస్తే చెప్పు పెళ్లి చేస్తాం..’ అని బతిమాలుతున్నారు. అయితే వివాహం ఇప్పట్లో చేసుకోవడం ఇష్టం లేని అమ్మాయిలు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రేమికుడిని.. మొగుడిని అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు వేల మంది ఇలాగే అడుగుండడంతో బాయ్ ఫ్రెండ్స్ ని సప్లయ్ చేసే ఏజెన్సీలు వెలిశాయి తెలుసా.. అది ఎక్కడో ఏమి ఆ సంగతో కింద చూడండి.. భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.

చైనా యువతులు చాలా మంది తమ ఇంటికి దూరంగా నగరాల్లో చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ లోపల పెళ్లి వయసు రావడంతో వివాహం చేసుకోమని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని అమ్మాయిలు.. బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకిచ్చే సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. అందంగా, మంచి పర్సనాలిటీతో ఉండే అబ్బాయిలు డబ్బులు తీసుకొని యువతులకు బాయ్‌ఫ్రెండ్‌గా నటిస్తారు. జనవరి 28న చైనా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొంటున్న నేపథ్యంలో చాలా మంది యువతులు సొంతూర్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు వివాహ ప్రస్తావన తేకముందే అద్దె బాయ్‌ఫ్రెండ్లను తీసుకెళ్లి వారికి పరిచయం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్‌ అనో, పెళ్లి చేసుకున్నామనో చెప్పి ఒత్తిడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నూతన సంవత్సరానికి మరో వారం రోజులే ఉండటంతో ఇప్పుడు అద్దె బాయ్‌ఫ్రెండ్‌ సర్వీసులకు డిమాండ్‌ భారీగా పెరిగింది.

నకిలీ బాయ్‌ఫ్రెండ్‌ని పొందాలంటే.. యువతులు రూ. 10వేల నుంచి 15వేల వరకు ఖర్చు చేయాల్సివస్తోంది. పర్సనాలిటీ, విద్యార్హతలను బట్టి రేటు ఉంటుంది. అయినా వారు వెనకాడట్లేదు. అయితే మరీ ముక్కూమొహం తెలియని వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తే తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసే అవకాశముంది. అబ్బాయి వివరాలు తెలుసుకోవడానికి వారు రకరకాల ప్రశ్నలు సంధిస్తారు. అందుకని అద్దెకు తీసుకున్న బాయ్‌ఫ్రెండ్‌తో ముందుగానే పరిచయం చేసుకుని కొద్దిరోజులు అవసరమైన వ్యక్తిగత విషయాలు అన్నీ చర్చించి.. ఆ తర్వాతే ఇంటికి తీసుకెళ్తున్నారట చైనా అమ్మాయిలు

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...