సోషల్ మీడియాలో కేసీఆర్ ను విమర్శిస్తే ఇక జైలుకే
kumar, 25/02/2017.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తే ఇకపై జైలుకే ఇది నిజం. విషయంలోకి వెళ్తే కేసీఆర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శకులు ఇకపై తమ పనికి స్వస్తి చెప్పాల్సిందే. సోషల్ మీడియాలో తెలంగాణ ముఖ్యమత్రి గురించి గాని లేదా ప్రభుత్వం గురించి దూషిస్తూ ఎలాంటి వార్తలు పోస్ట్ చేసినా ఇక మీద జైలే గతి. తెలంగాణ ప్రభుత్వం మీద మరియు తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఈ మధ్య చాలానే దుష్ప్రచారం జరుగుతోంది ఇది ఆగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వర్గాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగం సిద్దం చేశారని తెలుస్తోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో ప్రతిపక్షాలు కొంత మంది సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు అప్ లోడ్ చేస్తుండటాన్ని టీఆర్ఎస్ వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఉత్సాహం కాస్త శృతిమించి పోతుండటంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. అసభ్య పోస్టుల గురించి సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశామని ఇక నుంచి ఇలాంటి పోస్టులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఇలాంటి పోస్టులు ఆరోగ్యకరం కాదని ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకోవాలని అంతే కాని ఇలా ఒకరిని కించపరిచే విధంగా పోస్టింగులు అప్ లోడ్ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి. ఈ హెచ్చరికతో ఎలాంటి మార్పు వస్తుందో చూద్దాం మరి

No comments:
Post a Comment