ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లని దోమలు రెండు రెట్లు ఎక్కువ ఇష్టపడతాయట

 ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లని దోమలు రెండు రెట్లు ఎక్కువ ఇష్టపడతాయట

kumar, 25/02/2017.


దోమలు పదే పదే కొందరిని ఎందుకు కుడతాయి.. అసలు దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు విసిగిస్తాయి. అసలు ఎలాంటి వారిని దోమలు ఖచ్చితంగా టార్గెట్‌ చేస్తాయి అనేదానికి శాస్త్రీయమైన కారణాలున్నాయి.


చర్మం నుంచి వెలువడే రసాయనాలు, చర్మంపై ఉండే బ్యాక్టీరియాకు దోమలు అట్రాక్ట్‌ అవుతాయట. అందుకే దోమలు పదే పదే కుడుతుంటాయట. దోమలు కుట్టడానికి బయలాజికల్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నాయని అమెరికన్‌ మస్కిటో కంట్రోల్‌ అసోసియేషన్‌ టెక్నికల్‌ అడ్వైజర్‌, ఎంటామలాజిస్ట్‌ జోసె్‌ఫ.ఎమ్‌. కాలన్‌ చెబుతున్నారు.


గర్భిణులే టార్గెట్‌
సాధారణంగా ఆడదోమలు కార్బన్‌డయాక్సైడ్‌ ఉండే వాతావరణాన్నే ఇష్టపడతాయని 2002 సంవత్సరంలోని ఓ రీసెర్స్‌ ద్వారా తెలిసింది. ముఖ్యంగా గర్భిణులను దోమలు కుట్టడానికి ఇష్టపడతాయట. సాధారణ మహిళలకంటే గర్భిణులు (28 వారాల సమయంలో) విడిచే శ్వాసలో 21 శాతం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది. అందుకే దోమలు గర్భిణుల్ని కుడతాయని కార్నెల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ లారా చెబుతున్నాడు.


స్వేదం చిందితే చాలు…
శారీరకంగా కష్టపడినపుడు లాక్టిక్‌ఆమ్లం, యూరిక్‌ ఆమ్లం, అమ్మోనియా వంటి రసాయనాలు మన చర్మం నుంచి విడుదలవుతాయి. అందుకే చెమటపట్టిన దేహాల్ని దోమలు కుట్టడానికి ఇష్టపడతాయని పరిశోధకులు జోసెఫ్‌ చెబుతున్నాడు.


ఓ బ్లడ్‌ గ్రూప్‌..
ఎ, బి రక్తగ్రూపులతో పోలిస్తే ఓ గ్రూప్‌ రక్తాన్ని దోమలు రెండురెట్లు అధికంగా ఇష్టపడతాయట. మగదోమలు పూలు, తేనెపై ఆధారపడితే ఆడదోమలు మనుషుల రక్తాన్ని తాగటానికి ఇష్టపడతాయి. మొత్తానికి రక్తదాతలపై మాత్రం దోమల తాకిడి ఎక్కువగా ఉంటుంది.


కార్బన్‌డయాక్సైడ్‌
దోమలు కార్బన్‌డయాక్సైడ్‌ను 160 మీటర్లదూరంలో ఉన్నా పసిగడతాయి. వెంటనే అక్కడ వాలిపోయి. మనం నిద్రపోయే సమయంలో ముక్కు, నోటి నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ ఎక్కువశాతంలో విడుదలవుతుంది. దీనికి అట్రాక్ట్‌ కావటం వల్లే మనం నిద్రపోయే సమయంలో తలచుట్టూ శబ్దం చేస్తూ తిరుగుతుంటాయి.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...