నడుము నొప్పి ఎందుకు వస్తుంది.. వెంటనే తగ్గిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?!

నడుము నొప్పి ఎందుకు వస్తుంది.. వెంటనే తగ్గిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?!

kumar, 20/02/2017.


చాలామందిని ఇబ్బందిపెట్టే నడుమునొప్పికి కొన్ని కారణాలే కాదు.. చేసే పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ సమస్యను అధిగమించాలంటే.. ముందు చేసే పొరపాట్లను మానుకోవాలి. ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పని చేయడం వల్ల వెన్నెముకపై నలభైశాతం భారం పడుతుంది. నిటారుగా కూర్చోకపోవడం, వంగిపోయి పనిచేయడం లాంటివన్నీ సమస్యను ఇంకా పెంచుతాయి. దీన్ని అధిగమించాలంటే వీపు నుంచి నడుము భాగం వరకూ కుర్చీకి ఆనించి కూర్చోవాలి. తలను వీలైనంత వరకూ నిటారుగా ఉంచాలి తప్ప ముందుకీ, పక్కకీ వంచకూడదు. గంటకోసారి కుర్చీలోంచి లేచి నడవాలి. నముము నొప్పి నుంచి ఉపశమనానికి ఇంకా ఏం చేయాంటే..

• వ్యాయామం చేయకపోవడం కూడా నడుమునొప్పికి కారణమే. నడుమునొప్పి బారిన పడిన వారిలో నలభైశాతం మందిలో చురుకుదనం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి నడుమునొప్పి బారిన పడకుండా ఉండాలంటే తరచూ నడవాలి. దానివల్ల బిగుసుకుపోయినట్లుగా ఉన్న శరీరం సౌకర్యంగా మారుతుంది. నొప్పిని తగ్గించుకోవడానికి అత్యంత సులువైన పరిష్కారం యోగా అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కి చెందిన అధ్యయనకర్తలు.
• గుండె, మధుమేహం లాంటివి తగ్గించుకోవడానికే కాదు, అధికబరువును అదుపులో ఉంచేందుకు తీసుకునే ఆహారం కూడా నడుమునొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి ఆహారాన్ని నిర్లక్ష్యం చేసేవారు కొన్ని మార్పులు చేసుకోవాలి. కెఫీన్, ప్రాసెస్ చేసిన పదార్థాలు తగ్గించాలి. పొట్టుధాన్యాలూ, సోయా, నట్స్, గింజలూ, కూరగాయలూ, పండ్లూ ఎక్కువగా తీసుకోవాలి.
• చాలా సందర్భాల్లో వస్తువులన్నీ పట్టే హ్యాండుబ్యాగుని ఎంచుకుంటాం. అది మనకు సౌకర్యాన్నిచ్చినా బరువున్న బ్యాగును వేసుకోవడం వల్ల భుజాలు వంగిపోతాయి. అదే సమయంలో నడుముపైనా భారం పడి నడుమునొప్పి తప్పదు. కాబట్టి వీలైనంత వరకూ తక్కువ బరువున్న బ్యాగును ఎంచుకోవాలి. బ్యాగును ఒకే భుజానికి గంటల తరబడి వేసుకోకుండా తరచూ మారుస్తుండాలి. కుదిరితే రెండు బ్యాగుల్ని తీసుకోవాలి.
• ఏళ్ల తరబడి ఒకే పరుపును వాడటం కూడా నడుమునొప్పికి కారణమే. సాధారణంగా నాణ్యమైన పరుపులు కూడా పదేళ్లకు మించి వాడకూడదు. అయితే దానిపై పడుకున్నప్పుడు నడుము పట్టేసినట్లు ఉంటే.. ఏడేళ్ల తరవాత మార్చేయడం మంచిది. పరుపు మరీ మెత్తగా అలాగని గట్టిగా లేకుండా చూసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నవయితే నడుముపై భారం పడుతుంది. కాబట్టి సౌకర్యంగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...