బ్రాందీ, విస్కీ, వోడ్కా,రమ్, జిన్…..మందుకు ఎందుకు ఇన్ని పేర్లు. అసలు వీటి అర్థం ఏంటి?
kumar, 20/02/2017.
బీర్, వైన్, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, వోడ్కా… పేరేదైనా ఇవన్నీ ఆల్కహాలిక్ డ్రింక్సే. అన్నీ మద్యం కిందికే వస్తాయి. కాకపోతే వాటిలో కలిసే ఆల్కహాల్ పరంగా అవి కిక్ ఎక్కువ, తక్కువ ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ అది అందరికీ ఒకేలా ఉండదు. వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే మీకు తెలుసా..? ఈ డ్రింక్స్‌ను ఎలా తయారు చేస్తారో..? వాటి మధ్య తేడాలు ఏమిటో..? అసలు వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్…
బార్లీ, గోధుమలు వంటి ధాన్యాలను కిణ్వన ప్రక్రియ (ఫెర్మెంటేషన్)కు గురి చేసి అనంతరం అందులో ఈస్ట్ కలిపి దాని ద్వారా బీర్‌ను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆలే, రై, మొక్కజొన్నలు, బియ్యం, తృణ ధాన్యాలు, అల్లం, ఆలుగడ్డలు తదితరాలతో కూడా బీర్ ను తయారు చేస్తారు. అయితే బీర్‌కు ఆ పేరు biber అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. biber అంటే డ్రింక్ అని అర్థం. మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉన్న బీర్లలో 3 నుంచి 7 శాతం వరకు ఆల్కహాల్ ఉన్న బీర్లు మనకు లభిస్తున్నాయి.
వైన్…
ద్రాక్ష లేదా అదే జాతికి చెందిన ఇతర పండ్లను ఫెర్మెంటేషన్ ప్రక్రియకు గురి చేయడం ద్వారా వైన్ తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బార్లీ, ప్లమ్స్, చెర్రీలు, పైనాపిల్స్, అల్లం, పొమేస్, దానిమ్మ వంటి వాటితో కూడా వైన్‌ను తయారు చేస్తారు. వైన్‌లో 8 నుంచి 17 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే వైన్‌ను మరోసారి ఫెర్మెంటేషన్ చేసి షాంపేన్ తయారు చేస్తారు. ఇది చాలా ఖరీదు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని షాంపేన్ అనే ప్రాంతంలో దీన్ని ముందుగా తయారు చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అయితే వైన్‌కు మాత్రం Vinum అనే లాటిన్ పదం నుంచి పేరు వచ్చింది. Vinum అంటే ఔషధ సంబంధ విలువలు కలది అని అర్థం.
బ్రాందీ…
వైన్‌ను డిస్టిలేషన్ అనే ప్రక్రియకు గురి చేయడం ద్వారా బ్రాందీని తయారు చేస్తారు. ఇందులో 35 నుంచి 60 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. Baranduin అనే ఓ నది పేరిట దీనికి ఈ పేరు పెట్టారు. Baranduin అంటే గోల్డెన్ బ్రౌన్ రివర్ అని అర్థం.
విస్కీ…
బార్లీ, గోధుమలు, రై వంటి వాటిని బాగా నలిపి కిణ్వన ప్రక్రియకు గురి చేసి ఆ మిశ్రమం నుంచి విస్కీ తయారు చేస్తారు. ఇందులో 40 నుంచి 68 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. uiscebeatha అనే ఓ స్కాటిష్ పదం పేరిట విస్కీ కి ఆ పేరు పెట్టారు. uiscebeatha అంటే వాటర్ ఆఫ్ లైఫ్ అని అర్థం.
రమ్…
చెరుకు రసం లేదా చక్కెర తయారు చేసేటప్పుడు వచ్చే మొలాసిస్‌ను డిస్టిలేషన్ చేయడం ద్వారా రమ్‌ను తయారు చేస్తారు. ఇందులో 37 నుంచి 80 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. rumbullion అనే కరేబియన్ పదం పేరిట దానికి రమ్ అని పేరు పెట్టారు. rumbullion అంటే uproar అని అర్థం.
జిన్…
బార్లీ, రై, గోధుమలను బాగా నలిపి వాటిని డిస్టిలేషన్ చేసి అనంతరం వచ్చే మిశ్రమానికి జూనిపర్ బెర్రీలు లేదా ఇతర ఫ్రూట్స్ కలిపి మళ్లీ డిస్టిలేషన్ చేస్తారు. దీంతో జిన్ తయారవుతుంది. ఇందులో 40 నుంచి 50 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. genièvre అనే ఫ్రెంచ్ పదం, jenever అనే డచ్ పదం రెండింటి నుంచి జిన్ అనే పదం ఉద్భవించింది. జూనిపర్ బెర్రీల వల్ల కూడా దానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
వోడ్కా…
రై, గోధుమలు, మొక్కజొన్నలు, ఆలుగడ్డలు, ఫ్రూట్స్, మొలాసిస్ వంటి వాటిని డిస్టిలేషన్, ఫెర్మెంటేషన్ చేసి వోడ్కా తయారు చేస్తారు. ఇందులో 35 నుంచి 50 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. voda అనే రష్యన్ పదం నుంచి వోడ్కా అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
టకీలా…
మెక్సికోలో పెరిగే బ్లూ ఎగేవ్ అనే ఓ మొక్క ను డిస్టిలేషన్, ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియలకు గురి చేయడం ద్వారా టకీలా తయారు చేస్తారు. ఇందులో 33 నుంచి 51 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. సాధారణంగా ఈ డ్రింక్‌ను ఒక చిన్న నిమ్మకాయ ముక్క, కొద్దిగా ఉప్పుతో కలిపి షాట్స్ రూపంలో తీసుకుంటారు. సన్‌రైజ్, మార్గరీటా అనే కాక్‌టెయిల్ డ్రింక్స్‌లో దీన్ని ఎక్కువగా వాడుతారు. మెక్సికోలోని Tequila అనే ప్రాంతంలో దీన్ని మొదటగా తయారు చేయడం వల్ల దీనికి ఆ ప్రాంతం పేరే పెట్టారు.

No comments:
Post a Comment