ప్రభాస్ కొత్త సినిమా షూరు.

ప్రభాస్ కొత్త సినిమా షూరు.

kumar,14/02/2017.


వరుసగా రూపుదిద్దుకొన్న 'బాహుబలి ' చిత్రాలతోనే నాలుగు ఏళ్లు గడిపారు ప్రభాస్. తన కాల్షీటన్నీ ఆ సినిమాలకే కేటాయించారు. 'బాహుబలి: ది బిగినింగ్' విడుదల తర్వాత వేరే చిత్రం చేస్తారని ప్రచారం సాగినా... ప్రభాస్ మాత్రం బాహుబలి కోసమే సెట్స్ మీదకు వెళ్లే వారు. ఇటీవలే ఆ సినిమా పూర్తయింది. దాంతో ప్రభాస్ కొత్త సినిమా కి రంగం సిద్ధమైంది. 'బాహుబలి' తో ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాంతో తదుపరి ఆయన నటించనున్న కొత్త సినిమాని తెలుగుతో పాటు తమిళ,హిందీ లోనూ తెరకెక్కంచబోతున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఆ చిత్రాన్నికి సుజిత్ దర్శకుడు. ప్రమోద్, వంశీ నిర్మాతలు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రభాస్ పై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు కృష్ణంరాజు క్లాప్నిచ్చారు. దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రభాస్ నటిస్తున్న  19 వ చిత్రమిది. ఉత్తమమైన సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. రెగ్యూలర్ చిత్రీకరణ ప్రారంభంతో పాటు, ఇందులో నటించబోయే ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరల్ని త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...