మీ నెంబర్ అవతలి వారి సెల్ లో డిస్ ప్లే కాకుండా కాల్ చేయాలంటే ఇలా చేయండి!

మీ నెంబర్ అవతలి వారి సెల్ లో డిస్ ప్లే కాకుండా కాల్ చేయాలంటే ఇలా చేయండి!!

kumar,16/02/2017



మనకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మన ఫోన్లో ఆ నంబర్ కనిపిస్తుంది. అయితే మనం కొన్ని సినిమాల్లో, సీరియల్స్ లో ప్రైవేట్ నంబర్ పేరిట ఫోన్లు చేయడం గమనించే ఉంటాం. అంటే అవతలి వ్యక్తి ఎవరనేది తెలియదు అన్న మాట. మీరు కూడా మీ ఫోన్ నంబర్ ను ఎత్తే వారికి తెలియకుండా కాల్ చేయాలని అనుకుంటున్నారా? చాలా సింపుల్. మీ ఫోన్ సెట్టింగ్స్ లో మార్చుకుంటే మీ ఫోన్ నంబర్ ప్రైవేట్ గా మారుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ తీసుకొని ఫోన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి… అక్కడ Show my Caller ID అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి టర్న్ ఆఫ్( turnoff)చేయండి…




ఇప్పుడు మీరు ఎవరికీ ఫోన్ చేసినా మీ నంబర్ అవతలి వారికి కనిపించదు. ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ 4.0, ఆ పైన వచ్చే వెర్షన్స్ లో పని చేస్తుంది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
అయితే ఈ ఆప్షన్ వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో ఆని దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు ఆకతాయిల వేదింపులు ఎక్కువవుతాయి. మరీ ముఖ్యంగా తీవ్రవాదుల కార్యకలాపాలకు, బెదిరింపులకు పాల్పడే అసాంఘీక శక్తులకు ఈ ఆప్షన్ మరింత దోహదం చేస్తుంది. వారి ఆచూకీ కనుగొనడానికి సైబర్ పోలీసులకు మరింత కష్టమవుతుంది.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...