కేవలం రూ.20లకే కొత్త సినిమా!
kumar, 19/02/2017.
క్రిస్మస్, న్యూఇయర్ అకేషన్స్ ని బేస్ చేసుకుని ఇచ్చిన ఈ కొత్త సినిమా ఆఫర్ తో ఇప్పుడు గూగుల్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. గూగుల్ ప్లే మూవీస్ అందిస్తున్న ఈ ఆఫర్‌లో భాగంగా గూగుల్ ప్లే ఆన్‌లైన్ మూవీ స్టీమింగ్ సర్వీస్ నుంచి రూ.20కే కొత్త సినిమాలను అద్దెకు తీసుకోవచ్చు. కేవలం రూ. 20 చెల్లించి కొత్త సినిమాలు గూగుల్ ఆన్ లైన్ స్ట్రీమ్ లో ఎన్నైనా చూసుకొనే సదుపాయం కల్పించింది. ఆ ఆఫర్ క్రిస్మస్ నుంచి మొదలు వచ్చే ఏడాది జనవరి 23 వరకు కొనసాగుతుందని ప్రకటించింది గూగుల్ సంస్థ.
రిలీజైన మూవీస్ ను ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి ఇంట్లో ఫ్యామిలీతో సహా హోమ్ థియేటర్ లో ఎంచక్కా కొత్త మూవీని చూస్తూ కావలసిన స్టఫ్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు. గూగుల్ ఆఫర్ చేస్తున్న వాటిలో కొత్త మూవీస్ తో పాటు హాలివుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు.. జాసన్ బోర్న్, సూసైడ్ స్క్వాడ్, ఫైండింగ్ డోరి, ది జంగిల్ బుక్, ఎక్స్-మెన్, క్యాప్టైన్ అమెరికా , సివిల్వార్, జూటోపియా హాలీవుడ్ సినిమాలు అనేకం ఉన్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సుల్తాన్ మూవీ ఈ ప్రమోషనల్ ఆఫర్ లో ఉంది.

No comments:
Post a Comment