శుభ కార్యాల్లో డబ్బును బహుమతిగా ఇచ్చేటప్పుడు రూ.1 కలిపి ఇస్తారు. ఎందుకంటే..?
kumar, 19/02/2017.
మన దేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభ కార్యాల వంటివి చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్లే అతిథులు ఏదో ఒక బహుమతిని అందిస్తుంటారు. ప్రధానంగా హిందువులైతే పెళ్లిళ్లు, జన్మదినోత్సవాలు, వివాహ రిసెప్షన్లు వంటివి జరిగితే బహుమతులను అందజేస్తారు. ఒక వేళ అది వీలు కాకపోతే మనీ కవర్‌లో ఎంతైనా కొంత మొత్తం పెట్టి అందిస్తారు. అయితే ఆ మొత్తం అనేది ఎప్పుడూ రూ.51, రూ.101, రూ.201, రూ.501, రూ.1001 అలా ఉంటుంది. కొందరైతే శుభకార్యాలు కాకపోయినా తమకు రావల్సిన డబ్బులను కూడా ఇదే రీతిలో ఒక రూపాయి కలిపి మరీ తీసుకుంటారు. ఇంతకీ… అసలు ఇలా డబ్బుకు రూ.1 కలిపి ఎందుకు ఇస్తారో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.1000 ఈ మొత్తాల్లో అంకెల చివరికి సున్నాలు ఉన్నాయి కదా. అయితే అలా సున్నా వచ్చేలా డబ్బు రౌండ్ ఫిగర్‌తో ఇస్తే దాంతో ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అదే వధూ వరులకు అలా రౌండ్ ఫిగర్‌లో డబ్బును చదివిస్తే దాంతో వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయట.
అయితే రౌండ్ ఫిగర్‌లో కాకుండా రూ.51, రూ.101 అలా డబ్బును ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు కదా..! ఆ క్రమంలో వధూవరులు ఒకే మనస్సుతో కలిసి మెలసి ఉంటారట. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట. రౌండ్ ఫిగర్ మొత్తానికి రూ.1 కలిపి ఇవ్వడం వల్ల ఆ మొత్తాన్ని తీసుకునే వారికి, ఇచ్చే వారికి అన్ని విధాలుగా శుభం కలుగుతుందట. ఆరోగ్యం, విద్యతోపాటు వారికి ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయట. కొందరైతే అలా డబ్బు ఇవ్వడం వల్ల పెద్ద వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే మన పెద్దలు రౌండ్ ఫిగర్‌లో, సున్నా వచ్చేలా డబ్బును బహుమతిగా ఇవ్వకూడదని చెబుతారు..
No comments:
Post a Comment