హిందువులు తమ పిల్లలకు పెట్టకూడని పేర్లు ఇవే...

హిందువులు తమ పిల్లలకు పెట్టకూడని పేర్లు ఇవే...



కుమార్ ,25/01/2017,

 ప్ర‌పంచంలో ఏ త‌ల్లిదండ్రి అయినా త‌మ త‌మ పిల్ల‌ల‌కు త‌మ ఇష్టం ప్ర‌కారం పేర్లు పెడుతుంటారు. అయితే మ‌న దేశంలో ప్ర‌ధానంగా హిందూ సాంప్ర‌దాయానికి వ‌చ్చే స‌రికి చాలా మంది త‌మ‌కిష్ట‌మైన దేవుళ్లు, దేవ‌త‌ల పేర్ల‌ను త‌మ పిల్ల‌ల‌కు పెడుతారు. వాటిలో రామ‌, కృష్ణ‌, హ‌రి, శివ‌, అర్జున్‌, దుర్గ‌, గంగ‌, ల‌క్ష్మి… ఇలాంటివ‌న్న‌మాట‌. స‌ద‌రు దేవుళ్లు, దేవత‌ల ఆశీస్సుల‌తో వారు ఎల్ల‌ప్పుడూ క్షేమంగా ఉండాల‌ని కాంక్షిస్తూ ఏ త‌ల్లిదండ్రి అయినా పిల్ల‌ల‌కు అలాంటి పేర్ల‌ను పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..?  హిందూ పురాణాల్లో కేవ‌లం ఇలాంటి పేర్లే కాదు, ఇంకా చాలా మంచి పేర్లు కూడా ఉన్నాయ‌ని. అవును, ఉన్నాయి. కానీ దాదాపుగా ఎవ‌రూ ఆ పేర్ల‌ను త‌మ పిల్ల‌ల‌కు పెట్ట‌డం లేదు. అందుకు కార‌ణాలు కూడా ఉంటాయ‌నుకోండి, అది వేరే విష‌యం. అయితే అలా పెట్ట‌బ‌డ‌ని పేర్ల‌లో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 అశ్వత్దామ...
మ‌హాభార‌తంలో అశ్వ‌త్థామ గురించి తెలుసు క‌దా. పాండ‌వులు, కౌర‌వుల గురువు ద్రోణాచార్యుడి కొడుకు ఇత‌ను. ఎంతో శ‌క్తివంతుడు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో అశ్వ‌త్థాముడు అభిమ‌న్యుడి భార్య అయిన ఉత్త‌ర‌పై బ్ర‌హ్మాస్త్రం వేస్తాడు. ఆ స‌మ‌యంలో ఆమె గ‌ర్భంతో ఉంటుంది. దీన్ని చూసిన శ్రీ‌కృష్ణుడు అశ్వ‌త్థాముడికి శాపం పెడ‌తాడు. క‌లియుగం అంతం అయ్యే వ‌ర‌కు ప‌ర‌లోకంలో ఎంతో బాధ‌ను అనుభ‌విస్తూ తిరుగుతూనే ఉంటావ‌ని శ్రీ‌కృష్ణుడు అత‌నికి శాపం పెడ‌తాడు. అయితే ఈ అశ్వ‌త్థామ పేరును హిందువులు ఎవ‌రూ త‌మ పిల్ల‌ల‌కు పెట్ట‌రు.

ద్రౌపది....
ద్రౌప‌ది గురించి కూడా అంద‌రికీ బాగా తెలుసు. ధ‌ర్మ‌రాజు, భీముడు, అర్జునుడు, న‌కులుడు, స‌హ‌దేవుడు అని ఈమెకు పాండవులు ఐదురుగు భ‌ర్తలుగా కూడా ఉన్నారు. అయితే ఈమె పేరును కూడా హిందువుల్లో ఎవరూ త‌మ పిల్ల‌ల‌కు పెట్ట‌రు.

 సుగ్రీవుడు...
రామాయ‌ణంలో వాలి, సుగ్రీవుల క‌థ తెలుసుగా. వీరిద్ద‌రూ రాజ్యం కోసం ద్వంద్వ యుద్ధానికి దిగిన‌ప్పుడు రాముడు చాటు నుంచి బాణం వేసి వాలిని చంపుతాడు. దీంతో సుగ్రీవున్ని విజ‌యం వ‌రిస్తుంది. అత‌ను రాజ్యం పొందుతాడు. నిజానికి వాలిని ఓడించ‌డం సుగ్రీవుని త‌రం కూడా కాదు. అలాంటి అత‌ను అధ‌ర్మ యుద్ధం చేసి గెల‌వ‌డంతో రాజ్యం వ‌స్తుంది. ఈ క్ర‌మంలో సుగ్రీవుడ‌నే పేరు కూడా ఎవ‌రికీ ఉండ‌దు.

 మండోదరి....
రావ‌ణుని భార్యే మండోద‌రి. రావణాసురుడు ఎంత‌టి రాక్ష‌సుడో, ఎంత క్రూరంగా ఉంటాడో అందుకు పూర్తిగా ఈమె విరుద్ధం. చాలా ద‌య‌తో, స్నేహ‌భావంతో ఉంటుంది. అయినా రావ‌ణున్ని పెళ్లి చేసుకోవ‌డం వల్ల ఈమె పేరు కూడా ఎవ‌రికీ ఉండ‌దు. ఎవ‌రూ పెట్టుకోవ‌డానికి సాహ‌సించ‌రు.

గాంధారి...
దృత‌రాష్ట్రుని భార్య‌. భ‌ర్త‌కు క‌ళ్లు లేవ‌ని తెలిసి, అత‌నికి లేని చూపు త‌న‌కెందుకని భావించి తాను కూడా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని లోకాన్ని చూడకుండానే అంధురాలిలా జీవిస్తుంది. ఆమె సంతాన‌మే కౌర‌వులు. 100 మంది. అయితే ఈమె పేరు కూడా ఎవ‌రికీ ఉండ‌దు.

విభీషణుడు...
విభీష‌ణుడు రావ‌ణుని త‌మ్ముడు. స్వ‌త‌హాగా మంచి వ్య‌క్తే. కానీ అన్న‌కు వ్య‌తిరేకంగా వెళ్లి రాముడితో చేతులు క‌లుపుతాడు. అన్న ఎంతటి రాక్ష‌సుడు అయినా అత‌న్ని మోసం చేసి రామున్ని క‌ల‌వ‌డం వ‌ల్ల అత‌ని పేరును కూడా ఎవ‌రూ పెట్టుకోవడానికి ఇష్ట‌ప‌డ‌రు.

కైకేయ....
ద‌శ‌ర‌థుని భార్య‌. ఆమె అంటే అత‌నికి ఎంతో ఇష్టం. క‌డుపున పుట్ట‌క‌పోయినా రామున్ని త‌న సొంత కొడుకు భ‌ర‌తుడి కంటే ఎక్కువ‌గా ప్రేమించేది. చెలిక‌త్తె మాట‌లు విని ద‌శర‌థుడు రామున్ని అడ‌వులకు పంపేలా చేస్తుంది. ఎలాగైనా త‌న కొడుకు భ‌ర‌తుడే రాజ్యాధిప‌తి కావాల‌ని భావిస్తుంది. ఈ క్ర‌మంలో ఆమె పేరును ఎవ‌రూ పెట్టుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు గాక ప‌డ‌రు.

దుర్యోధనుడు...
మ‌హాభార‌తంలో దుష్ట చ‌తుష్ట‌యం అని పిలవ‌బ‌డే వారిలో దుర్యోధ‌నుడు కూడా ఒక‌డు. అత‌ని మోసాల వ‌ల్లే పాండవులు అడ‌వుల బారిన ప‌డి రాజ్యాన్ని కోల్పోతారు. అత‌ని మూర్ఖ‌త్వం, హింసా వాదం వ‌ల్లే కురుక్షేత్ర యుద్ధం కూడా సంభ‌విస్తుంది. అయితే ఇత‌ని పేరు కూడా ఎవ‌రికీ ఉండ‌దు. ఎవ‌రూ పెట్టుకోరు.

 మందర...
భ‌ర‌తుడు ప‌ట్టాభిషిక్తుడు కావాల‌ని, రాముడు అడ‌వుల‌కు వెళ్లాల‌ని కైకేయికి మంద‌ర విష బీజాలు నాటుతుంది. రాముడు, ద‌శ‌ర‌థుడిపై లేని పోని సందేహాలు, అపోహ‌లు సృష్టించి కైకేయికి ఎక్కించి మ‌రీ చెబుతుంది. ఆమె బుద్ధి చెడ‌గొడుతుంది. ఈ క్ర‌మంలో మంద‌ర పేరు కూడా మ‌నం ఎక్క‌డా విన‌లేదు. ఎందుకంటే ఆ పేరును ఎవ‌రూ పెట్టుకోరు క‌దా.

శకుని...
ఇక శ‌కుని పేరునైతే ఎవ‌రూ ఉచ్చ‌రించ‌డానికే ఇష్ట‌ప‌డ‌రు. అలాంటిది ఆ పేరును ఎలా పెట్టుకుంటారు..?  మాయా రాజకీయాల‌కు, కుతంత్రాల‌కు, మోసాల‌కు శ‌కుని పెట్టింది పేరు. మ‌హాభార‌తంలో కౌరవుల వెంట ఉండి వారి ప‌త‌నాన్ని శాసించాడు. అందుకే అత‌ని పేరును ఎవ‌రూ పెట్టుకోరు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...