భారత్ నిజమైన ఫ్రెండ్.. ట్రంప్

న్యూదిల్లీ/వాషింగ్టన్: భారతదేశం తమకు నిజమైన మిత్రదేశమని.. భాగస్వామి అని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో ఆయన ఫొన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడి హోదాలో మోదీతో ట్రంప్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారట. ముఖ్యంగా ఉగ్రవాదంపై చేయి చేయీ కలిసి పోరాడదామని, రక్షణ, భద్రత విషయంలో కలిసి పనిచేయాలని ఇరువురు అగ్రనేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా అమెరికాను సందర్శించాల్సిందిగా ట్రంప్ మోదీని కోరగా, భారత్‌కు విచ్చేయాలని ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు.
‘భారత్‌ను అమెరికా నిజమై మిత్రుడు, భాగస్వామిగా గుర్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లను కలిసి ఎదుర్కొంటాం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చించారు’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా ఆర్థిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారట. దక్షిణ, మధ్య ఆసియా ప్రాంత భద్రత విషయంపై మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ఇరుదేశాలు ముక్తకంఠంతో పోరాడాలని నిర్ణయించారని వైట్‌హౌస్ వెల్లడించింది.
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడిన ఐదో ప్రభుత్వాధినేత మోదీ. ఈ నెల 21 నుంచి కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు ప్రధానులతో ట్రంప్ మాట్లాడారు. రష్యా, చైనా, జపాన్, ఐరోపా దేశాధినేతల కన్నా ముందుగానే ట్రంప్ భారత దేశాధినేతతో మాట్లాడటం విశేషం.

No comments:
Post a Comment