ల్యాప్ టాప్ లోనూ ఆండ్రాయడ్ యాప్ లు

‘డెస్క్‌టాప్‌లో ఆండ్రాయిడ్ యాప్‌లు వాడుకునే వెసులుబాటు ఉంటే బాగుండేది’ అని ఆశపడుతున్న వారికి గుడ్ న్యూస్. ఇక నుంచి మార్కెట్‌లోకి వచ్చే అన్ని క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలోనూ ఆండ్రాయిడ్ యాప్‌లు పనిచేస్తాయట. గూగుల్ ‘క్రోమ్’ ఓఎస్‌తో పనిచేసే ఈ ల్యాపీలలో ఇక నుంచి స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే అన్ని ఆండ్రాయిడ్ యాప్‌లనూ ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చట. అందుకు ప్లే స్టోర్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ వెల్లడించింది.
సామ్‌సంగ్ క్రోమ్‌బుక్ ప్లస్.. ఏసర్ క్రోమ్‌బుక్ 11 ఎన్7 తోపాటు 2017లో విడుదలయ్యే దాదాపు 60 మోడళ్ల క్రోమ్‌బుక్‌లలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే ల్యాప్‌టాప్‌లో యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ యాప్‌ల ద్వారా మాల్‌వేర్లను పంపిస్తూ హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు.

No comments:
Post a Comment