Mahindra Talent Scholarship 2017,Free coaching for minority students,Jobs in Cochin Shipyard. మహీంద్రా టాలెంట్ స్కాలర్‌షిప్ 2017, మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.

Mahindra Talent Scholarship 2017,Free coaching for minority students,Jobs in Cochin Shipyard. మహీంద్రా టాలెంట్ స్కాలర్‌షిప్ 2017, మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.


మహీంద్రా టాలెంట్ స్కాలర్‌షిప్ 2017,
కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్- 2017 పేరిట స్కాలర్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
kcmahindra
వివరాలు:
కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ను దేశంలో అక్ష్యరాస్యత, ఉన్నతవిద్యను ప్రోత్సహించే లక్ష్యంతో కేసీ మహీంద్రా 1953లో ఏర్పాటుచేశారు.
-మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 550 (ప్రతి సంవత్సరం)
-స్కాలర్‌షిప్: రూ. 10,000/-చొప్పున బీద, యోగ్యత గల ప్రతి విద్యార్థికి ఏడాదికి చెల్లిస్తారు.
-వ్యవధి: గరిష్టంగా మూడేండ్లపాటు అందిస్తారు.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పదోతరగతి/ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ప్రాధాన్యత: బాలికలు, తక్కువ ఆదాయం గల కుటుంబాలు, పీహెచ్‌సీ అభ్యర్థులు, రక్షక దళాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. విద్యార్థులు దరఖాస్తు ఫారాన్ని జూలై 20లోగా తీసుకొని, అవసరమైన సర్టిఫికెట్లు, పూర్తి సెల్ఫ్ చిరునామా కవర్‌ను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి. దరఖాస్తు లభించే ప్రదేశం..
చిరునామా: Sree Jayanth Jayaram,Deputy General Marketing-Marketing, Mahindra & Mahindra Ltd Mahindra House, Auto Sector,T.S. Reddy Comple, 1-7-1, Park Lane, S.D.Road Secunderabad 500003
-దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 4
-వెబ్‌సైట్: www.kcmet.org



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



మైనారిటీ విద్యార్థులకు ఉచిత  కోచింగ్,

న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా బ్యాంక్ పీవో, సీజీఎల్, రైల్వే తదితర పోస్టులకు ఉచిత కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
JMI
వివరాలు:

జామియా మిలియా ఇస్లామియాలోని సెంటర్ ఫర్ కోచింగ్ అండ్ కెరీర్ ప్లానింగ్, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ ఈ ఉచిత శిక్షణను అందిస్తుంది.
-జామియా మిలియా ఒక సెంట్రల్ యూనివర్సిటీ.
-ఉచిత శిక్షణనిచ్చే పరీక్షలు: బ్యాంక్ పీవో, స్టాఫ్ సెలక్షన్ సీజీఎల్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (నాన్ టెక్నికల్), యూజీసీ నెట్/జేఆర్‌ఎఫ్, బీఈడీ, ఈటీఈ -2017 తదితర పరీక్షలు.
-ఈ కోచింగ్ కేవలం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-పరీక్షతేదీ: జూలై 30 (ఉదయం 10 - 12.00 వరకు)
-పూర్తి వివరాల కోసం ఫోన్ నంబర్లు: 011-65414144, 011-56981717
-వెబ్‌సైట్: www.jmi.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

కొచ్చిన్ షిప్‌యార్డ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది మినీరత్న హోదా కలిగిన కంపెనీ. 
-పోస్టు: అసిస్టెంట్ ఇంజినీర్ (ఐటీ)
-ఖాళీల సంఖ్య - 3
-వయస్సు: 40 ఏండ్లు మించరాదు
-అర్హతలు: మూడేండ్ల కంప్యూటర్ డిగ్రీ/ఐటీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా మూడేండ్ల కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఐటీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 12 

-వెబ్‌సైట్: www.cochinshipyard.com


No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...