ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాగా పొందొచ్చు.. బ్రోకర్ల అవసరమే లేదు!!

ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాగా పొందొచ్చు.. బ్రోకర్ల అవసరమే లేదు!!

kumar,16/02/2017.



డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా మంది బ్రోకర్లపై

డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా మంది బ్రోకర్లపై ఆధారపడుతుంటారు. ఆర్టీవో కార్యాలం చుట్టూ తిరగటం ఇష్టం లేని వారు, సమయం దొరకని వాళ్లు, లైసెన్స్ ఎలా పొందాలో తెలియని వాళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తుంటారు. ఈ మీడియేటర్లు కూడా ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని సొమ్ము చేసుకుంటారు. అయితే ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయింది. ఇప్పుడు ఎంచక్కా మీరు మీ ఇంటిలో కూర్చునే డ్రైవింగ్ లైసెన్స్ పొందేయొచ్చు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ముందుగా లెర్నర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఒకప్పుడు లెర్నర్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం వద్ద బారులు తీరాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ఆ అవసరం లేదు, ఆన్‌లైన్‌లోనే టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో కింద చూండి..

* ముందుగా లెర్నర్ లైసెన్స్ కోసం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు www.aptransport.org, తెలంగాణకు చెందిన వారు www.transport.telangana.gov.inఅనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో లైసెన్స్ (Licence) అనే మెనూలో లెర్నర్స్ లైసెన్స్ (Learner’s Licence) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.
* అప్పుడు లెర్నర్స్ లైసెన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెర్నర్ లైసెన్స్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవటానికి, మరొకటి లెర్నర్ లైసెన్స్ కోసం డెమో టెస్ట్‌ని బుక్ చేసుకోవటానికి. మనం ముందుగా లెర్నర్ లైసెన్స్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, CLICK HERE TO BOOK LEARNER LICENCE SLOT అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
* అప్పుడు ఓ సెపరేట్ పేజీ/విండో ఓపెన్ అవుతుంది. అందులో మళ్లీ లైసెన్స్ (Licence) అనే మెనూ క్రింద లెర్నర్ సెన్స్ టెస్ట్ (Learner Licence Test) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.
* ఆ తర్వాత మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో లేక ఏ జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ ధరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాను ఎంచుకున్న తర్వాత మీకు సమీపంలో ఉండే లేదా మీరుకు టెస్ట్‌కు హాజరు కాబోయే సెంటరును ఎంచుకొని సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
* ఆ తర్వాత ఓ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో అకెంలు రెడ్ కలర్‌లో ఉంటే ఆయా తేదీల్లో ఆన్‌లైన్ స్లాట్‌లు అందుబాటులో లేవని, అంకెలు గ్రీన్ కలర్‌లో ఉంటే ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉందని అర్థం.
* క్యాలెండర్‌లో గ్రీన్ కలర్ అంకెలపై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న సమయాలు, స్లాట్‌లు కనిపిస్తాయి. మీకు అనువైన సమయం ఎంచుకున్న తర్వాత సబ్‌మిట్ (SUBMIT)పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ఆన్‌లైన్ లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్ ఫారమ్(Online Learner’s License Application Form)పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుపై పేరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా నమోదు చేయాలి. దాంతో పాటుగా అక్కడ అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేసి తిరిగి (SUBMIT)పై క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న తేది, సమయానికి టైమ్ స్లాట్ బుక్ అవుతుంది.
* మీరు ఎంచుకున్న తేదీలో ఆ సమయానికి మీరు ఎంచుకున్న ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి టెస్టుకు హాజరయ్యినట్లయితే, మీకు లెర్నర్ లైసెన్స్ వస్తుంది. సాధారణంగా లెర్నర్ లైసెన్స్ చెల్లుబాటయ్యే కాలపరిమితి ఒక నెల వరకు ఉంటుంది. దాని గడువు ముగియక ముందే మీరు మరోసారి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...