స్మశానంలోకి ఆడవాళ్లను ఎందుకు రానివ్వరో తెలుసా?!
kumar, 25/02/2017.
ఆత్మీయులు, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మహిళలను స్మశానంలోకి అనుమతించరు. తరతరాలుగా హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నా ఆడవాళ్లను అనుమతించరాదని ఏ పురాణ గ్రంథమూ చెప్పలేదు.. అయితే దీనిపై మహాభారతంలో స్పష్టమైన వివరణ ఉంది. మహిళలు అంతిమ యాత్రలో పాల్గొనవచ్చని అందులో తెలిపారు. ఈ విషయాలను ఎస్జీ మోఘ్ రాసిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఇన్ ఎసెన్స్‌లోని ఆరో అధ్యాయమైన మరణాంతర జీవిత చరిత్రలో పొందుపరిచారు. భీష్మ పితామహుడు పార్ధివ దేహాంపై కౌరవ స్త్రీలు వస్త్రాలు, పుష్పాలు, ఛత్రాన్ని ఉంచి కురుకుల యోధుడు దహన సంస్కారాల్లో పాల్గొని నివాళులు అర్పించినట్లు తెలియజేశారు. మహిళలు కూడా తమ తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు నిర్వహించే హక్కు ఉంటుందని తెలిపారు.
అయితే శ్మశానాల్లో స్త్రీల ప్రవేశంపై ఎలాంటి నిబంధన లేదు. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే తల్లిదండ్రులకు మహిళలు అంతిమ సంస్కరాలు నిర్వహిస్తున్నారు. అయితే అమె కూడా తమ తల్లిదండ్రులకు సంతానంలో భాగమని విస్మరిస్తున్నారు. పురాణాల పరంగానూ స్త్రీలకు శ్మశానాల్లో ప్రవేశం నిషేధించిన దాఖలాలు కూడా లేవు. శతాబ్దాలుగా సాగుతోన్న పురుషాధిక్యత వల్ల తల్లిదండ్రులకు కొడుకు మాత్రమే అంతిమ సంస్కారాలు నిర్వహించాలనే ధోరణి అలవాటైంది. దీంతో మహిళల పట్ల చిన్నచూపుతో వారిని ఇనుప సంకెళ్లతో బంధించారు. ఇప్పుడిప్పుడే మహిళలు వీటి నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి తమ సొంతవాళ్లు ఎవరైనా మరణిస్తే స్వేచ్చగా స్మశానవాటికలకు వెళ్లి దహన సంస్కారాల్లో పాల్గొనవొచ్చు

No comments:
Post a Comment