ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోడం సులభం!..”హోమ్ లోన్” పై 2.5 లక్షల “సబ్సిడీ”!…
kumar, 17/02/2017.
సొంత ఇల్లు ఉండాలని ఎవరు కోరుకోరూ… మధ్యతరగతి వారికి సొంత ఇల్లు ఒక కల… సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి గృహరుణం అనేది ఒక వరం… వేలకి వేలు అద్దెలు పోసి అద్దె ఇంట్లో ఉండడం కన్నా…అద్దె డబ్బుల్లోకి మరికొంత కలుపుకుని లోన్ అమౌంట్ కట్టుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు చాలామంది.. అలాంటివారి కోసం కేంద్రం ఒక ఆఫర్ ప్రకటించింది… అదేంటంటే…
ఏడాదికి రూ.18 లక్షల వరకు జీతం ఉండి.. తొలిసారి ఇల్లు కొనే వారికి హోమ్‌లోన్‌లో రూ.2.4 లక్షల వరకు భారం తగ్గనుంది. గతంలో ఏడాది జీతం నిబంధన రూ.6 లక్షలకే పరిమితం కాగా.. దానిని ఇప్పుడు 18 లక్షలకు పెంచింది. గతంలో 15 ఏళ్ల పరిమితి ఉన్న గృహరుణాలపై ఈ ఆఫర్ ఉండగా.. ఇప్పుడు దానిని 20 ఏళ్లకు పెంచారు. గతేడాది డిసెంబర్ 31న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టింది.
ఏడాది ఆదాయాన్ని బట్టి ఈ సబ్సిడీ రేట్లలో తేడా ఉంటుంది. ఆరు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి.. వారి హోమ్‌లోన్‌లో రూ. ఆరు లక్షల మొత్తానికి 6.5 శాతం వడ్డీని కేంద్రమే భరిస్తుంది. అంటే వాళ్లు ఎంత మొత్తం లోన్ తీసుకున్నా సరే అందులో ఆరు లక్షలకు మాత్రమే 6.5 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఉదాహరణకు పది లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీకి గృహరుణంగా తీసుకుంటే అందులో మీరు రూ.6 లక్షల మొత్తానికి 2.5 శాతమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తానికి మాత్రం 9 శాతం వడ్డీ చెల్లించాలి. ఇలాగే ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి వాళ్ల మొత్తం గృహరుణంలో రూ.9 లక్షలపై 4 శాతం వడ్డీని కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది.
రూ.18 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి మొత్తం గృహరుణంలో రూ.12 లక్షలకు 3 శాతం వడ్డీని కేంద్రమే భరిస్తుంది. అంటే ఏడాదికి 9 శాతం వడ్డీతో 20 ఏళ్ల పరిమితికి గృహరుణం తీసుకుంటే.. ఈ మూడు కేటగిరీల వారికి రూ.2.4 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. నెలవారీ ఈఎంఐ కూడా సుమారు రూ.2200 వరకు తగ్గనుంది. హోమ్‌లోన్స్‌పై ఉన్న ఆదాయ పన్ను మినహాయింపులకు ఈ సబ్సిడీ అదనం. నేషనల్ హౌజింగ్ బ్యాంక్, హడ్కో ఈ సబ్సిడీ స్కీమ్స్‌కు నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి

No comments:
Post a Comment